రష్యా నుంచి వచ్చిన ఓ మహిళ కొన్ని నెలలుగా తమిళనాడులో ఉంటోంది. విదేశాల నుంచి వచ్చింది.. సున్నితంగా ఉంటుందనుకున్నాడో ఏమో.. కత్తితో ఇంట్లోకి దూరాడు ఓ దుండగుడు. కానీ.. ఆమె కరాటే దెబ్బలకు చతికిలపడ్డాడు.
రష్యాకు చెందిన ఆయిషా భారత్ కు వచ్చి గత జనవరి నుంచి తిరువన్నమళైలోని ఓ ఇంట్లో నివాసముంటోంది. కోయంబత్తూర్ కు చెందిన మణికందన్.. స్వామీజీ అవతారంలో అకస్మాత్తుగా ఆయిషా ఇంట్లోకి చొరబడ్డాడు. కత్తి చూపించి ఆయిషాను బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ, కరాటేలో రాటుదేలిన ఆయిషా తన విద్యను ప్రదర్శించింది. మణికందన్ ను చితకబాది తనను తాను రక్షించుకుంది.
అరుపులు విన్న ఇరుగుపొరుగువారు.. మణికందన్ ను బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషర్ మణికందన్‌ను అరెస్ట్ చేశారు. అసలు కత్తితో ఆయిషా ఇంట్లోకి ఎందుకు వెళ్లాడన్న కోణంలో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ మహాభారత అనువాది.. చదివేది ఏడో తరగతే