ETV Bharat / bharat

'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'

సరిహద్దుల్లో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు వాయుసేన చీఫ్ ఆర్​కెఎస్ భదౌరియా. గల్వాన్​ లోయలో మృతి చెందిన సైనికుల త్యాగాలను వృథాగా పోనివ్వమని.. దీటు సమాధానం చెబుతామన్నారు.

air cheif rks
'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'
author img

By

Published : Jun 20, 2020, 9:48 AM IST

Updated : Jun 20, 2020, 10:50 AM IST

సరిహద్దుల్లో ఇటీవల కాలంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు వాయుసేన చీఫ్ ఆర్​కేఎస్ భదౌరియా. సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధమని ఉద్ఘాటించారు. చైనా బలగాల అనూహ్య దాడిలో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పిన భదౌరియా.. జవాన్ల త్యాగాల్ని వృథాగా పోనివ్వమని వెల్లడించారు. హైదరాబాద్​ వేదికగా వాయుసేన పాసింగ్ ఔట్ పరేడ్​కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మన బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లద్దాఖ్​​లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు స్వల్పవ్యవధిలోనే ఎంత సంసిద్ధంగా ఉండాలో నొక్కి చెబుతున్నాయి. సైన్యాధికారుల స్థాయిలో చర్చలు.. ఏకాభిప్రాయం అనంతరం చైనా దాడి అనూహ్యమైంది. వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ఉద్రిక్తతలను శాంతియుతంగానే ఎదుర్కోవాలి."

-ఆర్​కెఎస్ భదౌరియా, వాయుసేన చీఫ్

గల్వాన్​లోయలో ప్రాణాలకు తెగించి సైనికులు పోరాడటం.. భారత సార్వభౌమాధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రక్షిస్తామన్న వారి అంకితభావానికి నిదర్శనమని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: దేశంలో 24 గంటల్లో 14,516 కరోనా కేసులు

Last Updated : Jun 20, 2020, 10:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.