ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో షెడ్యూల్ను విడుదల చేసింది ఆలయ నిర్వాహక కమిటీ. తెల్లవారుజామున 3 గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పింది.
మంగళ హారతితో షురూ..
- తెల్లవారుజాము 3 గంటలకు 'మంగళ హారతి' నిర్వహిస్తారు. అనంతరం 'మైలమ', 'తడప లాగి' సేవలు చేస్తారు.
- 4.30 గంటలకు 'అబకాష', ఉదయం 5.30 నుంచి 6.45 వరకు 'సకల దూప' కార్యక్రమం.
- 6.45కు రథప్రతిష్ఠ.
- ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు 'పహండి' కార్యక్రమం ఉంటుంది.
- 'మదన్ మోహన్ బిజె' ఉదయం 10 నుంచి 10.30 వరకు నిర్వహిస్తారు.
- ఉదయం 10.30-11.00.. 'చిత్త లాగి'.
- ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన 'చేరా పన్హారా' కార్యక్రమం 11.30 నుంచి 12.15 వరకు జరుగుతుంది.
- 11.45 నుంచి 12.30 వరకు సేవకులు రథాలను సిద్ధం చేస్తారు. అనంతరం మూడు రథాలతో ఊరేగింపు ప్రారంభమవుతుంది.
- ఇదీ చూడండి: చైనాతో 2 యుద్ధాలు.. గెలిచే దాకా వెనక్కితగ్గొద్దు!