ETV Bharat / bharat

'కరోనా టెస్ట్ చేయిస్తే ఫీజు రీఎంబర్స్​మెంట్!' - coronavirus latest news china

కరోనాపై పోరుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ప్రైవేటు ల్యాబ్​లలో పరీక్షలు చేయించుకున్నవారికి బిల్ మొత్తాన్ని ప్రభుత్వం రీఎంబర్స్​ చేసేలా ఓ విధానం రూపొందించాలని ఆదేశించింది.

supreme on private labs
'ప్రైవేటు ల్యాబ్​ల్లో పరీక్షలకు రీఎంబర్స్​మెంట్'
author img

By

Published : Apr 8, 2020, 2:16 PM IST

Updated : Apr 8, 2020, 2:22 PM IST

కరోనా పరీక్షలకు ప్రైవేట్​ ల్యాబ్​లు ప్రజల నుంచి అధిక ఫీజు వసూలు చేయకుండా చూసేందుకు ఓ యంత్రాంగాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం ప్రజలకు రీఎంబర్స్ చేసే విధానం అమలుకు నిర్దేశించింది.

దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.

'లాక్​డౌన్ ఎంతకాలమో చెప్పలేం'

వైరస్​పై తీసుకుంటున్న చర్యలను కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదించారు. దేశంలో వైరస్ విస్తరణ దశలో ఉందని.. ఎన్ని ల్యాబ్​లు అవసరమవుతాయో అంచనా వేసే అవకాశం లేదని పేర్కొన్నారు. లాక్​డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని తెలిపారు. 118 ల్యాబ్​ల ద్వారా రోజుకు 15,000 వైరస్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సుప్రీంకు వివరించారు. 47 ప్రైవేటు ల్యాబ్​లకు వైరస్ పరీక్షలకు అనుమతించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తే ఏడేళ్లు జైలు!

Last Updated : Apr 8, 2020, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.