ETV Bharat / bharat

రాజ్యసభ స్థానాలకు భాజపా అభ్యర్థులు ఖరారు

ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఎన్నిక కోసం భాజపా తమ అభ్యర్థులను ప్రకటించింది. యూపీ నుంచి 8 మందిని, ఉత్తరాఖండ్​ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించింది. ఈ తొమ్మిది మంచి విజయం లాంఛనమేనని తెలుస్తోంది.

RS polls: BJP announces 8 candidates from UP, one from U'khand
యూపీ రాజ్యసభ స్థానాలకు భాజపా అభ్యర్థులు ఖరారు
author img

By

Published : Oct 27, 2020, 8:00 AM IST

ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు పంపేందుకు అభ్యర్థులను ఖరారు చేసింది భాజపా. యూపీ నుంచి 8 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదేసమయంలో ఉత్తరాఖండ్ నుంచి బరిలోకి దిగే మరో అభ్యర్థి పేరును వెల్లడించింది.

యూపీలో ఖాళీ అయిన 10 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఈ నెల మొదట్లో ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీ అసెంబ్లీలో భాజపాకు 304 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ స్థానంలో కూడా భాజపా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ తొమ్మిది మంది ఎన్నికతో రాజ్యసభలో భాజపా సీట్ల సంఖ్య 90కి పెరగనుంది.

బరిలో ఎవరు?

యూపీ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ, భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, నీరజ్ శేఖర్ ఉన్నారు. వీరంతా ఇప్పటికే పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మరోవైపు గీతా శక్యా, హరిద్వార్ దుబే, బ్రిజ్​లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది సైతం బరిలో ఉన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.