కేరళలో ఈ ఏడాది ఓనం లాటరీని ఇడుక్కికి చెందిన అనంతు దక్కించుకున్నాడు. ఓ ఆలయంలో పనిచేస్తున్న అతను ఈ లాటరీ ద్వారా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.
ఎంబీఏ మానేసి ఆలయంలో చేరి..
అనంతు కుటుంబం వాలియాతోవాలలో ఓ శిథిలావస్థకు చేరిన ఇంట్లో నివాసముంటోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు.. కారే ఇల్లు అది. ఇలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అనంతు.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన ఎంబీఏ కలలను విరమించుకున్నాడు. ఎర్నాకుళంలోని ఓ ఆలయంలో పనిచేస్తున్నాడు. అతని తండ్రి పెయింటర్ కాగా.. తల్లి ఓ ప్రైవేటు వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఇలా చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషిస్తూ.. తమ పిల్లల్ని చదివించారు.
సాకారమవ్వనున్న కల
ఇలాంటి దీన పరిస్థితుల్లో తమ కుమారుడికి లాటరీ తగలడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది ఆ కుటుంబం. లాటరీ సొమ్ముతో తమ కలలు నిజం చేసుకుంటామని అంటున్నారు. అన్ని వసతులతో ఓ ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్ అందిస్తామంటున్నారు.
ఇదీ చదవండి: రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష