లద్దాఖ్ గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. విధి నిర్వహణలో వారు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని .. దేశం కోసం ప్రాణాలను వదిలి భారత సైన్యం విలువలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు.
"సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మర్చిపోదు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి క్లిష్ట సమయంలో యావత్ భారత్ వారికి మద్దతుగా నిలుస్తోంది."
-రాజ్‌నాథ్‌సింగ్, రక్షణ మంత్రి
సోమవారం రాత్రి జరిగిన భారత- చైనా సైనికుల ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా సైన్యం కమాండింగ్ అధికారి సహా సుమారు 40 మంది సైనికులు చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:భారత్-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే..