ETV Bharat / bharat

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ సర్కార్ చర్యలు

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ అసెంబ్లీలో అక్టోబర్ 31న తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. రైతుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ చర్యను అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాజస్థాన్ భాజపా ప్రతినిధి రామ్​లాల్ శర్మ పేర్కొన్నారు.

Rajasthan govt to bring bill against Centre's farm laws on Oct 31: Cong leader
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ సర్కార్ చర్యలు
author img

By

Published : Oct 26, 2020, 7:25 AM IST

కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రభుత్వం చట్టాలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. పంజాబ్ దారిలోనే కేంద్రం చట్టాలను అడ్డుకొనే విధంగా బిల్లును తీసుకురానుంది. అక్టోబర్ 31న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పేద రైతుల హక్కులను రక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు

  • After Punjab, Rajasthan Govt will pass a bill to negate the anti-farmers' provisions in the three agricultural bills passed by the Central Govt, on October 31st. @INCIndia is committed to protect our farmers & their rights.

    Congratulations to @ashokgehlot51 led Govt.

    — K C Venugopal (@kcvenugopalmp) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బిల్లును అక్టోబర్ 31న ప్రవేశపెట్టనుంది. రైతులతో పాటు వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి అభినందనలు."

-కేసీ వేణుగోపాల్ ట్వీట్

పంజాబ్ తరహాలోనే బిల్లులను తీసుకురానున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ సైతం తెలిపారు. ఇప్పటికే సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానించింది.

మరోవైపు గహ్లోత్ సర్కార్ చర్యలపై భాజపా పెదవి విరిచింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని రాజస్థాన్ భాజపా ప్రతినిధి రామ్​లాల్ శర్మ పేర్కొన్నారు.

ఇదీ చదవండి- 'వ్యవసాయ' బిల్లులను ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.