ETV Bharat / bharat

ప్రజల ముందే కాంగ్రెస్​ ఎమ్మెల్యేపై కాల్పులు - rajasthan congress mla

రాజస్థాన్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే భరోసీలాల్​ జాటవ్​పై ఓ యువకుడు దాడి చేశాడు. ఎమ్మెల్యే తన ఇంట్లో ప్రజలతో మాట్లాడుతుండగా తుపాకీతో కాల్చాడు. స్వల్పంగా గాయపడిన జాటవ్​కు ప్రాణాపాయం తప్పింది.

Congress MLA
భరోసీలాల్​ జాటవ్
author img

By

Published : Jun 24, 2020, 3:14 PM IST

రాజస్థాన్​లోని హిండౌన్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరోసీలాల్​ జాటవ్​పై పట్టపగలు ఓ యువకుడు కాల్పులు జరిపాడు. గాయపడిన జాటవ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాటవ్​ తన గృహంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది.

"ఆ వ్యక్తి నన్ను చంపేందుకు ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. నాపై దాడి చేసిన తర్వాత అతను పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కచ్చితంగా అతడికి శిక్ష పడుతుంది."

- భరోసీలాల్​ జాటవ్​

ఎమ్మెల్యేపై దాడి... స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. ఫలితంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఘటనపై రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ ఆరా తీశారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.