ETV Bharat / bharat

నిండు చూలాలు.. వందల కిలోమీటర్ల నడక ప్రయాణం - నిండు చూలాలు.. వందల కిలోమీటర్ల నడక ప్రయాణం

లాక్​డౌన్​ వేళ 8 నెలల గర్భవతి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఘటన రాజస్థాన్​ దౌసా ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భర్త బలవంతం వల్లే కాలినడకన బయలుదేరినట్లు తెలిపింది ఆ గర్భవతి.

pregnant-woman-forced-to-travel-hundreds-of-km-in-her-scorching-sun
నిండు చూలాలు.. వందల కిలోమీటర్ల నడక ప్రయాణం
author img

By

Published : Apr 19, 2020, 3:48 PM IST

Updated : Apr 19, 2020, 4:06 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన వేళ వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేయటానికి పనులు లేక, కుటుంబ పోషణకు డబ్బులు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఈ తరుణంలో శనివారం ఓ గర్భవతితో సహా మొత్తం 18 మంది వలస కార్మికుల కుటుంబం గుజరాత్​లోని దౌసా నుంచి ఉత్తరప్రదేశ్​లోని బరేలీకి కాలినడకన బయలుదేరారు. తన భర్త బలవంతం చేసిన కారణంగానే తాను బయలుదేరినట్లు తెలిపింది ఆ గర్భవతి.

"మేమందరం దౌసాలోని ఓ ఇటికబట్టీలో పని చేస్తున్నాం. మా యజమాని పని వద్దకు రావటం లేదు. మా బాధను పట్టించుకోవటం లేదు. పని చేయకపోతే మాకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అధికారులు మమ్మల్ని నడవకుండా ఆపలేరు" అని కుటుంబసభ్యుల్లో ఒకరైనా నంద్రామ్​ తెలిపారు.

నిండు చూలాలు.. వందల కిలోమీటర్ల నడక ప్రయాణం

"మా కూతురు గర్భవతి కారణంగానే దౌసా నుంచి బరేలీలో ఉన్న సొంత ఇంటికి వెళ్తున్నాము. మేమందరం కాలినడకనే ఉత్తరప్రదేశ్​కు బయలుదేరాము. ఇక్కడ ఆసుపత్రులు ఎలా ఉంటాయో మాకు తెలియదు, కనుక ఆ భయంతోనే ఇంటికి వెళ్తున్నాము. ఇది మా సొంత ఊరు కాదు." అని కుటుంబ సభ్యురాలు చంద్రకళ వెల్లడించింది.

గర్భవతికి సంబంధించి ఆసుపత్రికి అయ్యే ఖర్చును ఇవ్వాలని యజమానిని కోరినప్పటికి అతను కుదరదని చెప్పినట్లు పేర్కొంది. ఆ నగదు ఇక్కడ ఉండి సమకూర్చుకోలేకనే తన భర్త ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించింది. ఇంటికి వెళ్తే ఏ విధంగానైనా చికిత్స చేయించుకోగలమన్న నమ్మకంతోనే వెళ్తున్నట్లు తెలిపింది. మార్గ మధ్యలో అనేక చెక్​పోస్ట్​ల​ను దాటుకుంటూ వెళ్తునప్పటికినూ ఆమె పరిస్థితిని చూసి ఒక్కరు కూడా సాయం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తప్పని పరిస్థితుల్లో వందల కిలోమీటర్ల మేర నడక ప్రయాణం చేస్తున్నట్లు తెలిపింది.

Last Updated : Apr 19, 2020, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.