ETV Bharat / bharat

'భారత సంప్రదాయ వైద్యంతో కరోనాకు చెక్​ పెట్టండి' - coronavirus precautions

కొవిడ్​-19కు వ్యతిరేకంగా సాగుతున్న పోరులో ఆయుష్​ వైద్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత సంప్రదాయ వైద్యంతో కరోనా కోరలు పీకేయాలని సందేశమిచ్చారు. టెలీమెడిసిన్​ సాయంతో ప్రజలకు సేవలందించాలని సూచించారు.

PM urges AYUSH practitioners to pitch in to combat coronavirus
'భారత సంప్రదాయ వైద్యంతో కరోనాకు చెక్​ పెట్టండి'
author img

By

Published : Mar 28, 2020, 5:50 PM IST

కరోనా వైరస్​ను జయించేందుకు 'ఆయుష్' వైద్యులు రంగంలోకి దిగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహమ్మారిపై భారత్​ చేపట్టిన యుద్ధంలో ఆయుష్​ పోషించాల్సిన పాత్ర కీలకమైందని తెలిపారు. ఆయుష్​ వైద్యులు వారికి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి, శానిటైజర్ల వంటి వైరస్​ నాశినిలను ఉత్పత్తి చేయాలని కోరారు.

ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధవైద్యం, హోమియోపతి వైద్యవిద్యల సమూహమైన ఆయుష్​ వద్ద కరోనాకు విరుగుడు లేదనే వాదనను పట్టించుకోవద్దన్నారు ప్రధాని. ​అవసరమైతే ​ప్రైవేటు ఆయుష్ డాక్టర్ల సాయం తీసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. టెలీమెడిసిన్​ సాంకేతికత సాయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు.

కరోనా ఒత్తిడిని జయించేందుకు ప్రజలు 'ఇంట్లో యోగా చేయాలి' అని ప్రచారం చేస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖను ప్రధాని ప్రశంసించారు. భారత సంప్రదాయ వైద్యరంగాన్ని ప్రచారం చేయడం అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:విపత్తు నిధులతో వలస కూలీలకు ఆహారం, వసతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.