ETV Bharat / bharat

'ఆరోగ్యకర జీవనానికి ఆయన మంత్రమే స్ఫూర్తి' - Acharya Mahapragya birth centenary

యోగా ద్వారా లక్షలాది మందికి ఒత్తిడి రహిత జీవిత కళను ఆచార్య మహాప్రజ్ఞ నేర్పించారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన అందించిన 'ఆరోగ్యమైన వ్యక్తి, ఆరోగ్యమైన సమాజం, ఆరోగ్యమైన ఆర్థిక వ్యవస్థ' సూత్రం దేశానికి ఆదర్శమన్నారు. మహాప్రజ్ఞ శతజయంతి వేడుకల సందర్భంగా ప్రసంగించారు మోదీ.

PM recalls Acharya Mahapragya's contributions
ఆచార్య మహాప్రజ్ఞ సేవలను కొనియాడిన మోదీ
author img

By

Published : Jun 19, 2020, 3:38 PM IST

జైన ఆధ్యాత్మిక నాయకులు ఆచార్య మహాప్రజ్ఞ 100వ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఆరోగ్యమైన వ్యక్తి, ఆరోగ్యమైన సమాజం, ఆరోగ్యమైన ఆర్థిక వ్యవస్థ' అనే మహాప్రజ్ఞ సూత్రం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి స్ఫూర్తిదాయకమని శతజయంతి కార్యక్రమంలో ఆన్​లైన్​ ద్వారా ప్రసంగించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. 'సంతోషమైన కుటుంబం, సంపన్న దేశం' అనే ఆధ్యాత్మిక నేత కలను సాకారం చేయడానికి దేశ ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఇది మనకు దక్కిన అవకాశమమని పేర్కొన్నారు.

యోగా ద్వారా లక్షలాది మందికి ఒత్తిడి రహిత జీవిత కళను మహాప్రజ్ఞ నేర్పించారని కొనియాడారు మోదీ. ఈ ఆదివారం రోజు యోగా దినోత్సవం జరుపుకోవాల్సి రావడం యాదృచ్ఛికమన్నారు.

జైన మత శాఖ శ్వేతాంబర్ తేరాపంత్​కు ఆచార్య మహాప్రజ్ఞ 10వ అధిపతి. సంస్కృతం, హిందీ, గుజరాతీ, ఆంగ్ల భాషలలో 300కు పైగా పుస్తకాలు రాశారు. మాజీ రాష్ట్రపతి, దివంగత నేత అబ్దుల్​ కలాంతో కలిసి ఓ పుస్తకాన్ని రచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.