ETV Bharat / bharat

కరోనా కట్టడికి 'జన్‌ ఆందోళన్‌' ప్రారంభించనున్న మోదీ

కరోనా‌ కట్టడే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం 'జన్‌ ఆందోళన్‌' పేరిట ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమాన్నిప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. పండుగలు, ఇతర కార్యకలాపాల దృష్ట్యా కరోనా నియంత్రణకు ప్రజల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపుడుతోంది కేంద్రం.

PM Narendra Modi to launch 'Jan Andolan for COVID-19 Appropriate Behaviour' campaign
కరోనా కట్టడికి 'జన్‌ ఆందోళన్‌' ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Oct 8, 2020, 5:05 AM IST

రానున్నది పండుగల సీజన్.. జనం పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికితోడు చలికాలం సమీపిస్తున్న వేళ కరోనా వైరస్‌ మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జన్‌ ఆందోళన్‌’ పేరిట ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్‌తో ప్రారంభిస్తారని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ వెల్లడించింది. పండుగలు, ఇతర కార్యకలాపాల దృష్ట్యా కరోనా నియంత్రణకు ప్రజల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపింది.

మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పే సందేశంతో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగనుంది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలను లక్ష్యంగా చేసుకొని ప్రతి పౌరుడికి సరళంగా, సులభంగా అర్థమయ్యేలా సందేశాలను రూపొందించనున్నారు. అన్ని మీడియా వేదికలను ఉపయోగించుకోవడంతో పాటు ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలతో బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, పోస్టర్లు అతికించడం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఈ ప్రచారాన్ని ప్రజల్లో విస్తృతంగా చేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో హోర్డింగ్‌లు, వాల్‌ పెయింటింగ్‌లు, డిజిటల్‌ బోర్డులను అమర్చనున్నారు. అలాగే, మొబైల్‌ వ్యాన్లతో నిత్యం అవగాహన కల్పించనున్నారు. కరోనా నియంత్రణపై ప్రచారానికి ఆడియో సందేశాలు, కరపత్రాలు, బ్రోచర్లను వినియోగించడంతో పాటు స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల మద్దతు కూడా తీసుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.