సామాజిక మాధ్యమాల్లో ఇతర నాయకుల కంటే ప్రధాని నరేంద్ర మోదీకి విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా ట్విట్టర్లో మోదీ ఫాలోవర్స్ సంఖ్య 6 కోట్లకు పెరిగింది.
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ... వాటి ద్వారానే ప్రజలతో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటారు మోదీ. ప్రజలకు సందేశాలు పంపడానికి ఆయన ట్విట్టర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు.
2009 జనవరిలో ట్విట్టర్ ఖాతాను తెరిచిన మోదీ... 2019 సెప్టెంబరు నాటికే 5 కోట్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. @narendramodi ట్విట్టర్ ఖాతా ప్రకారం... 2,354 మందిని ప్రధాని అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 కోట్ల మందికిపైగా మోదీని ఫాలో అవుతున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతాను 3.7 కోట్ల మంది అనుసరిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 1.5 కోట్ల మంది అనుసరిస్తున్నారు. 267 మందిని రాహుల్ ఫాలో అవుతున్నారు.
ట్విట్టర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 8.3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే... ట్రంప్ కేవలం 46 మందినే అనుసరిస్తున్నారు.
ఇదీ చూడండి: రఫేల్ మోహరింపుపై వాయుసేన ఉన్నతాధికారుల చర్చ