ETV Bharat / bharat

వ్యాక్సిన్ వచ్చేవరకు నిర్లక్ష్యం వద్దు: మోదీ

కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాక్సిన్​ వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైరస్​ పోయిందని, ప్రమాదం లేదని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. పండుగల వేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న సంతోషాలు దూరమైపోతాయని హెచ్చరించారు.

pm modi addressing the nation ahead of festival season
జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
author img

By

Published : Oct 20, 2020, 6:21 PM IST

Updated : Oct 20, 2020, 6:49 PM IST

కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రజలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్​ పోయిందని, ప్రమాదం లేదని అనుకోవద్దని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయని గుర్తు చేశారు.

కరోనా వ్యాక్సిన్​ వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు మోదీ. ఇందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. పండుగల వేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ఆనందాలు దూరమైపోతాయని, అప్రమత్తతతోనే జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయని స్పష్టం చేశారు.

" కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ పూర్తయింది. కానీ వైరస్ మాత్రం ఇంకా ఉంది. ప్రజలు కరోనా జాగ్రత్తలను పట్టించుకోకుండా ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా నిబంధనలు పాటించకపోవడం ఏ మాత్రం మంచిది కాదు. మాస్కులు లేకుండా అజాగ్రత్తగా తిరిగితే మీతో పాటు మీ పిల్లలు, పెద్దలను ప్రమాదంలోకి నెట్టిన వారు అవుతారు. నవరాత్రులు, దసరా, దీపావళి వేళ మనందరం మరింత అప్రమత్తంగా ఉండాలి. అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువ చేసి చూడవద్దు. "

-ప్రధాని నరేంద్ర మోదీ

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా విజృంభణ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది ఏడో సారి.

Last Updated : Oct 20, 2020, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.