ETV Bharat / bharat

'మరో 5 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ' - Pradhan Mantri Garib Kalyan Anna Yojana

జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. "ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో 80కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతారని స్పష్టం చేశారు.

pm-gareeb-kalyan-anna-yojana-will-be-extended-till-the-end-of-november-prime-minister-narendra-modi
'మరో 5 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ'
author img

By

Published : Jun 30, 2020, 4:35 PM IST

"ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు మోదీ. ఫలితంగా 80కోట్ల మందికిపైగా ప్రజలకు ఉచితంగా అహార ధాన్యాలు అందుతాయని పేర్కొన్నారు.

అన్​లాక్​-2పై మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ విషయం వెల్లడించారు.

"వానాకాలంలో అన్నిటికన్నా వ్యవసాయ రంగంలో ఎక్కువ పని ఉంటుంది. పైగా జులై నుంచి ముఖ్య పండుగలు మొదలవుతాయి. గురు పూర్ణిమ, పంద్రాగస్టు, రక్షాబంధన్​, శ్రీ కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దసరా తదితర పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఫలితంగా అందరికీ అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజనను నవంబర్​ చివరి వరకు పొడిగించాలని నిర్ణయించాం."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం, గోధుమలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. గత మూడు నెల ఖర్చులతో కలిపి ఈ పథకానికి రూ. 1.5లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నట్లు వివరించారు ప్రధాని.

తస్మాత్​ జాగ్రత్త...

అన్​లాక్​-2ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని కీలక సూచనలు చేశారు. వానాకాలం వచ్చిందని.. జలుబు, జ్వరం వంటి వ్యాధులు చుట్టుముట్టే అవకాశముందని హెచ్చరించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అన్​లాక్​-1 ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల్లో కరోనా విషయంలో అశ్రద్ధ పెరిగిందన్నారు మోదీ. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనలను ఉల్లింఘించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.