ETV Bharat / bharat

పైలట్​ వ్యాజ్యంపై రాజస్థాన్​ హైకోర్టు విచారణ వాయిదా

author img

By

Published : Jul 16, 2020, 1:37 PM IST

Updated : Jul 16, 2020, 9:23 PM IST

PILOT FILES PETITION IN HIGH COURT
హైకోర్టును ఆశ్రయించిన సచిన్ పైలట్

21:02 July 16

రేపు విచారణ...

స్పీకర్​ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్​ వర్గం దాఖలు చేసిన వ్యాజ్యంపై రేపు విచారణ చేపట్టనుంది రాజస్థాన్​ హైకోర్టు. ఈ వ్యాజ్యం ఈరోజు రాత్రి 7:30గంటలకు విచారించాల్సి ఉన్నప్పటికీ.. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా పడింది.

తొలుత ఈ వ్యాజ్యాన్ని జస్టిస్​ సతీశ్​ చంద్ర విచారించారు. తాజా పిటిషన్​ దాఖలు చేయడానికి సమయం కావాలని సచిన్​ తరఫు న్యాయవాది అభ్యర్థించగా.. న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పిటిషన్​ మళ్లీ విచారణకు వచ్చింది. తాజా పిటిషన్​ను డివిజన్​ బెంచ్​కు సిఫార్సు చేశారు జడ్జి.

మళ్లీ రాత్రి 7:30 గంటలKG హాజరుకావాలని కోర్టు చెప్పినట్టు కౌన్సిల్​ ఆఫ్​ కాంగ్రెస్​ చీఫ్​ విప్​ మహేశ్​ జోషీ తెలిపారు. కానీ విచారణ జరగలేదు. ఫలితంగా..  స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసుల రాజ్యాంగబద్ధతపై డివిజన్ బెంచ్ రేపు విచారణ జరపనుంది. అయితే విచారణ రేపటికి వాయిదాపడటం సచిన్​ వర్గానికి ప్రతికూల విషయం. నోటీసులపై స్పందించడానికి స్పీకర్​ ఇచ్చిన గడువు రేపు మధ్యాహ్నం ఒంటిగంటతో ముగుస్తుంది. కోర్టు అదే సమయానికి పిటిషన్లను విచారించనుంది.

ఇదీ జరిగింది..

పార్టీపై అసంతృప్తితో సచిన్​ పైలట్​ రెబల్​ నేతగా మారారు. ఫలితంగా సీఎల్​పీ సమావేశానికి హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో పైలట్‌తో పాటు ఆయన పక్షాన నిలిచిన 18 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని నాయకత్వం నిర్ణయించింది. దీనిని సవాల్​ చేస్తూ రాజస్థాన్​ హైకోర్టులో పిటిషన్​ వేసింది పైలట్​ వర్గం. వారి శాసనసభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ వారందరికీ.. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సీపీ జోషీ నోటీసులు పంపారు. 

16:06 July 16

సచిన్​ వర్గానికి అవకాశం...

రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌లో రేగిన కల్లోలం హైకోర్టుకు చేరింది. అశోక్‌ గెహ్లోత్‌ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురేసిన వారిపై అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలంటూ.. నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ విచారణకు రాగా.. అందులో మార్పులు చేసేందుకు అవకాశం కల్పించాలని పైలట్ వర్గం తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ మేరకు వ్యాజ్యంలో మార్పులు చేసి కొత్త పిటిషన్ వేసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ఈ విషయానికి సంబంధించి డివిజన్ బెంచ్‌ల వాదనలు జరుగుతాయని హైకోర్టు తెలిపింది. స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసు రాజ్యాంగబద్ధతపై డివిజన్ బెంచ్ తేల్చనుంది. 

పైలట్‌తో పాటు ఆయన పక్షాన నిలిచిన 18 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ వారందరికీ.. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సీపీ జోషి నోటీసులు పంపారు. పార్టీ విప్‌ను ధిక్కరించిన ఈ 19మందిపై చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ సభా పక్షం తీర్మానం చేసి స్పీకర్‌కి పంపగా ఆయన వారికి నోటీసులు పంపారు.

14:48 July 16

3గంటలకు విచారణ

తనకు స్పీకర్​ నోటీసులు జారీ చేయడంపై రాజస్థాన్​ హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్​ రెబల్​ నేత సచిన్​ పైలట్​. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు విచారించనుంది.

పార్టీ ఆదేశాలను ధిక్కరించి శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో.. రాజస్థాన్‌ సభాపతి సీపీ జోషి మొత్తం 19మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు.

మరోవైపు స్పీకర్​​ తరఫున అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.

13:33 July 16

హైకోర్టును ఆశ్రయించిన సచిన్ పైలట్

రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్. స్పీకర్ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్​పై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది.

Last Updated : Jul 16, 2020, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.