లాక్డౌన్ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో ఎంతో మందికి ఊరట కలిగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూనే.. బయటికొచ్చి తమ తమ అవసరాలు తీర్చుకుంటున్నారు సాధారణ ప్రజలు. మందుబాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గ్రీన్జోన్లు సహా కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ప్రకటనతో.. ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు లిక్కర్ప్రియులు. ఉదయం నుంచే మద్యం షాపుల ముందు బారులు తీరారు. అదీ భౌతిక దూరం పాటిస్తూ.
దిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది యడియూరప్ప సర్కార్. ఫలితంగా బెంగళూరు, హుబ్లీ పరిసర ప్రాంతాల మద్యం దుకాణాల ముందు వందల మీటర్ల మేర లైన్లలో నిల్చొన్నారు.
![People line up at a liquor shop in Bengaluru as state government permits the sale of liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7050873_ben.jpg)
![People line up at a liquor shop in Bengaluru as state government permits the sale of liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-klr-4-wine-shops-av-7205620_03052020165926_0305f_1588505366_992_0305newsroom_1588519491_5.jpg)
దిల్లీ లక్ష్మీ నగర్లోనూ మందుబాబులు బారులు తీరారు.
![People line up at a liquor shop in Bengaluru as state government permits the sale of liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7050873_del.jpg)
భౌతిక దూరమేదీ..?
ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కనీసం భౌతికదూరం పాటించకుండా కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నారు. పోలీసులు వారిని అదుపుచేస్తున్నారు. కంటెయిన్మెంట్ జోన్లు మినహా మద్యం షాపులు తెరిచేందుకు అనుమతినిచ్చింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.
క్షౌరశాలలు కూడా...
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయంతో... ఆరెంజ్, గ్రీన్ జోన్లలో క్రమంగా క్షౌరశాలలు తెరుచుకుంటున్నాయి. గోవా పనాజీలోని సెలూన్లు జనంతో నిండిపోయాయి. భౌతిక దూరం పాటిస్తూ.. తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.
![People line up at a liquor shop in Bengaluru as state government permits the sale of liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7050873_goa.jpg)
కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్డౌన్ అమల్లో ఉంది. అప్పటి నుంచి మద్యం దుకాణాలు, సెలూన్లు మూతబడ్డాయి.