ETV Bharat / bharat

'రఫేల్​ ఒప్పందం నచ్చకే పారికర్​ రాజీనామా' - రఫేల్​

రఫేల్​ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరనందునే మనోహర్​ పారికర్​ రక్షణ మంత్రి పదవిని వదులుకున్నారని ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​ ఆరోపించారు.  2014 ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విఫలమయ్యారని విమర్శించారు.

"రఫేల్​ ఒప్పందం నచ్చకే పారికర్​ రాజీనామా"
author img

By

Published : Apr 14, 2019, 6:50 AM IST

రఫేల్​ ఒప్పందం నచ్చకే పారికర్​ రాజీనామా: పవార్​

రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పంద విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​. రఫేల్​పై ఏకాభిప్రాయం కుదరకనే గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్... రక్షణ మంత్రి ​పదవిని వదులుకున్నారని ఆరోపించారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌​లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు.

" రఫేల్​ ఒప్పందం మనోహర్​ పారికర్​కు నచ్చలేదు. అందువల్లే ఆయన రక్షణ మంత్రి పదవిని వదులుకుని గోవాకు తిరిగొచ్చారు."
-శరద్​పవార్​, ఎన్​సీపీ అధినేత

దేశంలోని రాజాంగ్య సంస్థలను స్వలాభాలకోసం భాజపా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు పవార్​. సాయుధ దళాలతో ప్రధానమంత్రి, భాజపా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్​ షా ల కలయిక దేశానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్న మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేనాధినేత రాజ్​ ఠాక్రేను అభినందించారు. అది అక్షరాలా నిజమని పేర్కొన్నారు పవర్​.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.