ETV Bharat / bharat

పాక్ కుట్ర భగ్నం- ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అరెస్టు - 2 Khalistani operatives nabbed in punjab

పంజాబ్​లో వరుస దాడులు, హత్యలకు కుట్రపన్నిన ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలతో, ఐఎస్​ఐతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ముష్కరుల నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Pak-linked terror module busted, 2 Khalistani operatives nabbed
పంజాబ్​లో ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదుల అరెస్టు
author img

By

Published : Jun 19, 2020, 7:36 PM IST

ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదులను పంజాబ్​ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్​కు చెందిన ఉగ్రసంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్న వీరు... రాష్ట్రంలో వరుస దాడులు, హత్యలకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

ఖలిస్థాన్ ఉగ్రవాదులు గుర్మీత్​ సింగ్​, విక్రమ్ సింగ్​ను గురువారం రాత్రి జండియాలా పోలీస్​స్టేషన్​ పరిధిలోని గురుదాస్​పురియా దాబా సమీపంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఎంపీ 5 సబ్​ మెషీన్​గన్​, నాలుగు మ్యాగజైన్​లతో కూడిన 9 ఎంఎం పిస్టళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Pak-linked terror module busted, 2 Khalistani operatives nabbed
ఖలిస్థాన్ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

"మొబైల్ ఫోన్లలో ఉగ్రదాడులకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్రాలు, వాయిస్ మెసేజ్​లతో పాటు ఓ ప్రత్యేక ప్రాంతం జియో-లొకేషన్ డేటా​ కూడా ఉంది. పాక్​ ఉగ్రసంస్థలతో చేసిన అనుమానాస్పద లావాదేవీల వివరాలు కూడా అందులో ఉన్నాయి."

- పంజాబ్​ పోలీసులు

ఐఎస్​ఐతో కలిసి కుట్ర

44 ఏళ్ల గుర్మీత్ సింగ్ అమృత్​సర్​ సుల్తాన్​విండ్ రోడ్​లోని గండా సింగ్ కాలనీకి చెందినవాడు. ఇతని వద్ద దొరికిన మొబైల్ ఫోన్లోని సమాచారం ఆధారంగా.. ఇతనికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్​ఐతో పాటు, భారత్​ వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

"సుమారు 3 ఏళ్ల క్రితం పాకిస్థానీ ఉగ్రసంస్థలను కలుసుకున్నాను. వారు పంజాబ్​లో ఉగ్రదాడులు చేయాలని, ప్రత్యేకించి కొంత మంది నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని మాకు చెప్పారు."

- గుర్మీత్ సింగ్, ఖలిస్థాన్ ఉగ్రవాది

ఈ కేసును చాలా తీవ్రంగా తీసుకున్న పోలీసులు.. ఖలిస్థాన్ కుట్రలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: భారత్​-చైనా 'శాంతి' చర్చలు ఇక ముగిసినట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.