ETV Bharat / bharat

రైతుల విషయంలో భాజపాకు ఆ రెండే అడ్డంకి? - భాజపా పంజాబ్​

నూతన సాగు చట్టాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు విపక్షాలు అడ్డంకిగా మారాయని భాజపా పంజాబ్​-హరియాణా నేతలు పేర్కొన్నారు. రైతులకు మంచి చేద్దామని ఈ చట్టాలు తీసుకొస్తే.. విపక్షాలు మాత్రం వారిని తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు. రైతుల సందేహాలు తీర్చలేకపోవడానికి కరోనా సంక్షోభం కూడా ఓ కారణమన్నారు.

Oppn 'propaganda', pandemic hampered efforts to communicate with farmers, say some BJP leaders from Pb, Haryana
'రైతుల్లోకి వెళ్లేందుకు అవరోధంగా విపక్షం-కరోనా'
author img

By

Published : Dec 7, 2020, 6:45 PM IST

రైతుల్లో నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించే విషయంలో భాజపా విఫలమైనట్టు ఆ పార్టీ పంజాబ్​, హరియాణా నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు విపక్షం, కరోనా సంక్షోభమే కారణాలని చెప్పారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు. వారి తప్పుడు ప్రణాళికలను అడ్డుకోవడంలోనే సమయం అయిపోయిందని పేర్కొన్నారు.

"భాజపాలోని ప్రతి ఒక్కరు.. రైతుల వెంటే ఉన్నారు. అన్నదాతల సంక్షేమం కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ చట్టలు తీసుకొచ్చింది. కానీ ఏదైనా మంచి చేద్దామనుకుంటే.. కొందరు తప్పుగా చూస్తారు. ఈ క్రమంలోనే విపక్షాల వ్యూహాలను అడ్డుకోవడంలో మేము ఇరుక్కుపోయాము. లేకపోతే.. రైతులకు ఈ చట్టాలపై అవగాహన కల్పించడంలో కచ్చితంగా విజయం సాధించేవాళ్లం."

--- సుర్జిత్​ కుమార్​ జయని, భాజపా నేత.

రైతులను సంప్రదించి, వారిలో ఉన్న సందేహాలను తీర్చడానికి భాజపా ఏర్పాటు చేసిన 8 మంది సభ్యుల ప్యానెల్​లో జయని ఒకరు. ప్రభుత్వం- రైతుల మధ్య జరుగుతున్న చర్చల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- మంగళవారం 'భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు!

'కరోనా సంక్షోభంతో...'

నూతన చట్టాలతో జరిగే మంచి గురించి రైతులకు చెప్పలేకపోవడానికి కరోనా సంక్షోభం కూడా ఓ కారణమని తెలిపారు హిసార్​ భాజపా ఎంపీ బ్రిజేంద్ర సింగ్​. సమస్యలకు చర్చలు ఒక్కటే పరిష్కారమన్నారు.

'రైతులు సహా వ్యవసాయ రంగంలోని అందరికీ.. ఈ చట్టాలపై ప్రభుత్వం అవగాహన కల్పించేదే. కానీ కరోనా సంక్షోభం ఆ అవకాశం లేకుండా చేసింది.'

-- బ్రిజేంద్ర సింగ్​, భాజపా ఎంపీ.

ఇదీ చూడండి:- సాగు చట్టాలపై విపక్షాలు గరం​- భాజపా ఫైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.