దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విస్తృత తనిఖీలు నిర్వహించింది. బంగాల్లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకులంలో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉగ్రకార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని అరెస్ట్ చేసింది.
దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వీరు దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందడం వల్ల ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. తనిఖీల్లో భాగంగా డిజిటల్ పరికరాలు, పత్రాలు, జిహాదీ సాహిత్యం, పదునైన ఆయుధాలు, దేశీయ తుపాకులు, పేలుడు పరికరాలను రూపొందించేందుకు కావల్సిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది.
ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వీరు దిల్లీ వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేసింది ఎన్ఐఏ.
ఇదీ చూడండి:- ఇస్లామిక్ స్టేట్లోకి తెలుగు రాష్ట్రాల వ్యక్తులు!