ETV Bharat / bharat

ముగిసిన మమత సత్య'ఆగ్రహం'

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష విరమించారు.

author img

By

Published : Feb 5, 2019, 10:36 PM IST

దీక్ష విరమించిన మమతా బెనర్జీ

పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఎట్టకేలకు దీక్ష విరమించారు. ఆదివారం మొదలైన దీదీ ఆగ్రహం మూడు రోజుల తర్వాత శాంతించింది. సుప్రీం కోర్టు సానుకూల తీర్పునివ్వడంతో ప్రధాన విపక్షాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

"ఇదొక గొప్ప విజయమని విపక్షాలు నమ్ముతున్నాయి. ఈ ధర్నా... ప్రజలకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి గెలుపును అందించింది. సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించడంతో దీక్షను ఇంతటితో విరమించాలని నిశ్చయించాము. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగానే సుప్రీం తీర్పు ఉంది. ఈ దీక్షను ఈరోజు ముగిస్తున్నాము. కానీ మా నిరసనలను దిల్లీలో కొనసాగిస్తాము."
-మమతా బెనర్జీ, పశ్చిమ్​బంగ ముఖ్యమంత్రి.

కేంద్ర వ్యవస్థలను ఉపయోగించి ప్రజలను భాజపా బెదిరిస్తోందని దీదీ ఆరోపించారు. సీబీఐపై తనకు అపార గౌరవముందన్నారు. ప్రధాని మోదీ, అమిత్​ షా ఆదేశాల మేరకు ​బంగాల్​లో అలజడి సృష్టించిన సీబీఐ... అంతే వేగంగా ఇతర కేసులపైనా విచారణ చేపట్టాలని విమర్శించారు.

అంతకుముందు...

ఆదివారం మొదలైన బంగాల్​ వివాదం మూడో రోజూ కొనసాగింది. సీబీఐ దాఖలు చేసిన అభ్యర్థనను విచారించిన సుప్రీంకోర్టు.. కీలక తీర్పు వెలువరిచింది. సత్యాగ్రహం చేపట్టిన మమతకు విపక్షాల నుంచి మద్దతు పెరిగింది.

అరెస్టు వద్దు... విచారణ మాత్రమే: సుప్రీం

శారదా కుంభకోణం విచారణ కోసం సీబీఐకు సహకరించాలని కోల్​కతా సీపీ రాజీవ్​కుమార్​కు ఆదేశించింది సుప్రీంకోర్టు. రాజీవ్​ను అరెస్టు చేయకూడదని సీబీఐకు సూచించింది.

సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై బంగాల్​ డీజీపీ, కోల్​కతా సీపీకి నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

undefined

తీర్పు ఇద్దరికీ అనుకూలమే!

సుప్రీం తీర్పును బంగాల్ ప్రభుత్వం, కేంద్రం పోటాపోటీగా స్వాగతించాయి. న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని... తీర్పు ప్రజాస్వామ్య విజయమని ప్రకటించారు మమత.

బంగాల్​ వివాదాన్ని రాజకీయం చేయాలనుకున్న వారికి అత్యున్నత న్యాయస్థాన తీర్పు ఘోర పరాభవమని కేంద్రమంత్రి రవి శంకర్​ ప్రసాద్ దుయ్యబట్టారు.

మమత సత్యాగ్రహానికి మద్దతు...

మమత సత్యాగ్రహం మూడో రోజూ కొనసాగింది. దీదీకి విపక్షాల నుంచి విశేష మద్దతు లభించింది. అంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కోల్​కతా వెళ్లి మమతను కలిశారు. కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీలు దీదీకి అండగా నిలిచాయి.

ఉభయసభల్లో అదే పరిస్థితి...

బంగాల్​ వివాదం వరుసగా రెండో రోజు.. ఉభయసభలను కుదిపేసింది. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు ఏకమై ఉభయసభల్లో ఆందోళనలు చేపట్టాయి. గందరగోళం మధ్య రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. 2గంటలకు మొదలైనా పరిస్థితి సద్దుమణగక సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. లోక్​సభలోనూ ఇదే పరిస్థితి. అనేక సార్లు వాయిదా పడింది.

రాజీవ్​ కుమార్​ పదేళ్ల ముందు...

పదేళ్ల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తమ నాయకుల ఫోన్లు టాప్​ చేస్తున్నట్టు రాజీవ్​కుమార్​పై మమత ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే రాజీవ్​కుమార్​ కోసం కేంద్రంపై యుద్ధం చేయడం గమనార్హం.

దీదీ సత్యాగ్రహానికి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు

New Delhi, Feb 05 (ANI): The national capital hosted India-Monaco Business forum, which saw the presence of Commerce and Industry Minister Suresh Prabhu and Monaco's head of state Prince Albert II. Prabhu said the two countries have immense potential to improve their bilateral relations, and emphasised on "services sector" which can boost economic relations between India and Monaco.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.