ETV Bharat / bharat

3నెలల తర్వాత తెరుచుకున్న సెలూన్​ షాపులు - మిషన్ బిగిన్ ఎగైన్

మూడు నెలల తర్వాత ముంబయిలో సెలూన్ షాపులు తెరుచుకున్నాయి. అయితే కంటైన్​మెంట్​ జోన్లలో యథావిధిగా ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు అధికారులు.

Mission Begin Again: Salons reopen in Mumbai after 3 months
మూడు నెలల తర్వాత తెరుచుకున్న సెలూన్​ షాపులు
author img

By

Published : Jun 28, 2020, 3:22 PM IST

Updated : Jun 28, 2020, 3:35 PM IST

లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా సెలూన్​ షాపులను తెరవడానికి అనుమతిచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మూడు నెలల సుదీర్ఘ కాలం తర్వాత ముంబయిలో సెలూన్ షాపులు తెరుచుకున్నాయి. కానీ కంటైన్​మెంట్​ జోన్లలో మాత్రం పార్లర్లు, సెలూన్​పై యథావిధిగా ఆంక్షలు కొనసాగనున్నాయి.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే వినియోగదారులకు అనుమతినివ్వనున్నట్లు సెలూన్​ షాపుల యజమానులు చెబుతున్నారు. అయితే సెలూన్​కు రావడానికి ప్రజలు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. షాపుల్లో పనిచేసేందుకు సిబ్బంది రాకపోవడం వల్ల తెరిచిన కొంత సమయానికి షాపులను మూసివేశారు యజమానులు.

నాల్గో దశ 'మిషన్ బిగిన్ ఎగైన్'లో భాగంగా సెలూన్​కు సంబంధించిన మార్గాదర్శకాలను విడుదల చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. షాపులను క్షవరమునకు మాత్రమే తెరవాలని తెలిపిన సర్కార్​ ఇతర సర్వీసులకు అనుమతిలేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​

Last Updated : Jun 28, 2020, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.