ఓ బాలుడు.. రూ.500 దొంగిలించాడని ఆరోపించిన పక్కింటివారు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఆ దెబ్బలకు అతను చనిపోయాడు.
ఒడిశా మయూర్భంజ్లోని కియాపనాపోసీ గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ హత్యలో ఓ మహిళ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బాలుడి కుటుంబసభ్యులు స్థానిక కరాంజియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.