ETV Bharat / bharat

హెచ్చరిక: వేగంగా కరిగిపోతోన్న హిమాలయాలు

author img

By

Published : Jun 20, 2019, 6:40 AM IST

Updated : Jun 20, 2019, 8:05 AM IST

పర్యావరణ కాలుష్యంతో హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఏటా 800 కోట్ల​ టన్నుల మంచు కరిగిపోతోందని కొలంబియా భూ పరిశోధన విశ్వవిద్యాలయం పరిశీలనలో వెల్లడైంది. 1971, 1986లో అమెరికా ఉపగ్రహాలు తీసిన ఫొటోల ద్వారా అంచనా వేశారు శాస్త్రవేత్తలు.

హెచ్చరిక: వేగంగా కరిగిపోతోన్న హిమాలయాలు

పర్యావరణ కాలుష్యంతో హిమాలయాలకు ముప్పు పెరుగుతోంది. 40 ఏళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం రెండు రెట్లు అధికంగా మంచు కరుగుతోందని అమెరికా గూఢచారి ఉపగ్రహాలు తీసిన ఫొటోల ద్వారా వెల్లడైంది. ఏటా సుమారు 800 కోట్ల​ టన్నుల మంచు కరిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

1971, 1986లలో అమెరికా పంపించిన కేహెచ్​-9, హెక్సాగాన్​ అనే గూఢచారి ఉపగ్రహాలు కొన్ని ఛాయాచిత్రాలను పంపించాయి. వీటిని పరిశీలించిన కొలంబియా భూ పరిశోధన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హిమాలయాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్చరిక: వేగంగా కరిగిపోతోన్న హిమాలయాలు

"ఒకవేళ ఈ శతాబ్దం ముగిసేవరకు భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్​లోపు ఉంచగలిగినా... మూడో వంతు హిమాలయాలు తుడిచిపెట్టుకుపోతాయి. కానీ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగితే.. దాదాపు సగం హిమాలయాలు కరిగిపోతాయి. వివిధ నివేదికలు, పరిశోధనలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సుమారు సగం మంచు పర్వతాలు తుడిచిపెట్టుకుపోతాయి. "

- డా.భోపాల్ పండేయా, హిమాలయ వాతావరణ పరిశోధకుడు

72 శాతమే ఉంది...

2000 సంవత్సరం నుంచి ఆసియాలోని పర్వతాల్లో ఏటా 830 కోట్ల​ టన్నుల మంచు కరిగిపోతోంది. 1975-2000 మధ్య కాలంలో అది 430 కోట్ల​ టన్నులుగా ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 1975తో పోలిస్తే ప్రస్తుతం హిమాలయాల్లో 72 శాతం మాత్రమే మంచు ఉందని తెలిపారు. 2000 సంవత్సరం నుంచి ఏటా 1 శాతం మంచు కరిగిపోతోందని వెల్లడించారు.

తీవ్ర నీటి ఎద్దడికి మూలం...

ఇదే రీతిలో మంచు కరిగితే.. హిమాలయాల ద్వారా వచ్చే నదులు అడుగంటిపోయి తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సూచించారు.

చాలా ఏళ్లుగా హిమాలయాలు కరిగిపోయేందుకు గల కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అందులో కాలుష్యం, వర్షపాతంలో మార్పు వంటివి ఉన్నాయి. కానీ పర్యావరణ మార్పులే హిమాలయాలపై అధిక ప్రభావం చూపుతున్నాయని కొలంబియా శాస్త్రవేత్తల బృందం నిర్ధరించింది.

ఇదీ చూడండి: అగ్రశ్రేణి విద్యాలయాల జాబితాలో భారత్​కు చోటు

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 19 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2154: US CO Baseball Brawl Must credit Lakewood Police Department 4216666
Police look for adult brawlers at kid's ball game
AP-APTN-2147: US WA Boeing Jets KOMO - must credit KOMONEWS.COM; no access Seattle market; no use US broadcast networks 4216665
737 Max jets on hold at Boeing facility
AP-APTN-2131: Brazil Corruption Probe AP Clients Only 4216663
Brazil's Moro says he has 'nothing to hide'
AP-APTN-2119: Sudan Protest AP Clients Only 4216662
Protests continue demanding civilian rule
AP-APTN-2100: UK Climate Protest AP Clients Only 4216661
Activists stage climate protest in London
AP-APTN-2045: ARC Roy Moore AP Clients Only 4216660
Roy Moore to announce U.S. Senate plans
AP-APTN-2037: US Branded Women AP Clients Only 4216659
Self-help guru convicted in sex-trafficking case
AP-APTN-2028: US NV Train Derailment Must credit Michael Lyday 4216658
Nevada train derailment causes interstate closure
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 20, 2019, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.