కేరళ కోజికోడ్ జిల్లాకు చెందిన యువధర కట్టూలి యువజన సంస్థ... భారీగా పెరిగిన ఇంధన ధరలపై వినూత్న నిరసన చేపట్టారు. ధరతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ వరుడు కాగా.. డీజిల్ వధువు. కట్టూలి యువజన సభ్యులు కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.
పెట్రోల్, డీజిల్ ల పెళ్లి పెద్దగా గ్యాస్ సిలిండర్ బాధ్యతలు నిర్వర్తించింది. మూడు నిత్యావసర ఇంధనాల ధరను ప్రభుత్వం ఈ స్ఠాయిలో పెంచేస్తే.. ప్రజలు వాటిని కొనుగోలు చేయడమెలా అంటు ప్రశ్నించారు యువధర కట్టాలి సభ్యులు.
ఇదీ చదవండి: లక్షల లీటర్ల బీరు వృథా కానుందా?