ETV Bharat / bharat

పెళ్లి కోసం 850కి.మీ సైక్లింగ్​- ముహూర్తం టైమ్​కు క్వారంటైన్

పంజాబ్​లో పని చేస్తున్న సోనూ కుమార్​ వివాహం ఈ నెల 15న ఉత్తరప్రదేశ్​లోని తన సొంత ఊరులో జరగాల్సి ఉంది. కానీ లాక్​డౌన్​ వల్ల పంజాబ్​లోనే చిక్కుకుపోయాడు సోనూ. ఎలా అయినా పెళ్లి మండపానికి చేరుకోవాలని.. 850 కిలోమీటర్ల సైకిల్​ యాత్రను ఆరంభించాడు సోనూ. అయితే తన స్వగ్రామానికి 150 కిలో మీటర్ల దూరంలో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. చివరకు క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు.

Marriage plans end in quarantine for youth who cycled from Punjab to UP
లాక్​డౌన్​ తిప్పలు- వెడ్డింగ్​ టు క్వారంటైన్​
author img

By

Published : Apr 19, 2020, 10:28 AM IST

Updated : Apr 19, 2020, 2:47 PM IST

పెళ్లి. ఎవరి జీవితంలోనైనా ఓ మధురానుభూతి. కానీ ప్రస్తుత లాక్​డౌన్​ పరిస్థితుల్లో కొందరు వధూవరులకు వివాహం ఓ పీడ కలగానే మిగిలిపోతోంది. తాజాగా ఓ ఉత్తరప్రదేశ్​ వాసి.. తన పెళ్లి కోసం 850 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర చేశాడు. శుభం కార్డు పడుతుందనుకునే సరికి.. పెళ్లి మండపం బదులు క్వారంటైన్​ కేంద్రంలో పడ్డాడు.

సైకిల్​పైనే..

సోనూ కుమార్ చౌహాన్​​ స్వగ్రామం ఉత్తరప్రదేశ్​లోని పిప్రా రసూల్​పుర్​. కానీ అతడు పంజాబ్​లోని లుథియానాలో ఓ టైల్స్​ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. 24ఏళ్ల సోనూకు ఈ నెల 15న వివాహం జరగాల్సి ఉంది.

లాక్​డౌన్​ వల్ల లుథియనాలో చిక్కుకుపోయాడు సోనూ. వేరే మార్గం లేక.. పెళ్లికి వారం రోజుల ముందు సైకిల్​ మీద స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ 850 కిలోమీటర్ల యాత్రలో సోనూకు మరో నలుగురు మిత్రులు కూడా తోడయ్యారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాళ్లందరూ సైకిల్​ తొక్కుతూ ఎలాగైనా సమయానికి ఊరు చేరుకోవాలనుకున్నారు.

కానీ సోనూ ఆశలు నెరవేరలేదు. గత ఆదివారం.. ఉత్తరప్రదేశ్​లోని మహారాజ్​గంజ్​ జిల్లాలోకి ప్రవేశిస్తుండగా అధికారులు వారిని అడ్డుకున్నారు. ఆ వెంటనే వారిని క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. పిప్రా రసూల్​పుర్​కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండిపోయాడు ఆ పెళ్లికుమారుడు.

పెళ్లిని నిరాడంబరంగానే చేసుకుందామని అనుకున్నట్టు సోనూ తెలిపాడు. ఇంకో 150 కిలోమీట్లు ప్రయాణించి ఉంటే ఈ పాటికి తన వివాహం జరిగిపోయేదని వాపోయాడు. అధికారులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పోలీసులు మాత్రం.. సోనూ, అతడి స్నేహితులు 14రోజుల పాటు క్వారంటైన్​లోనే ఉంటారని స్పష్టం చేశారు. అనంతరం రిపోర్టులును పరిశీలించి ఇంటికి పంపుతామన్నారు.

ఇదీ చూడండి:- గృహ హింసకు పాల్పడితే క్వారంటైన్​కే!

Last Updated : Apr 19, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.