ETV Bharat / bharat

21 అడుగుల పద్యంతో ప్రపంచ రికార్డు - వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​

కరోనా లాక్​డౌన్​ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఓ యువకుడు తన ప్రతిభకు సానబెట్టాడు. తనలోని కవితా నైపుణ్యాన్ని బయటకుతీసి తులూ భాషలో ఓ పద్యాన్ని రాశాడు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు అతనికి ఎనలేని ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక పద్యం రాస్తేనే ఇంత గుర్తింపు ఎందుకు అనుకుంటున్నారా?

Tulu poem penned by Engineering Student of Mangaluru registered in World Book of Records
'తులూ'లో పద్యం రాసి ప్రపంచ రికార్డు కొట్టేశాడు
author img

By

Published : Jun 19, 2020, 3:42 PM IST

మాస్టర్​ ప్రణేశ్​.. కర్ణాటక మంగళూరులోని ఇంజినీరింగ్​ ద్వితీయ సంవత్సరం విద్యార్థి. రచనల పట్ల ఆసక్తి ఉన్న ఇతను గతంలో ఎన్నో పద్యాలు రాశాడు. అదీ తులూ భాషలో. అయితే.. కరోనా లాక్​డౌన్​ కాలంలో ప్రణేశ్​ రాసిన 'తులునాద ఇసిరీ' అనే ఓ పద్యానికి విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఏకంగా వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డుల్లో చోటు సంపాదించింది.

Tulu poem penned by Engineering Student of Mangaluru registered in World Book of Records
అతిపెద్ద పద్యానికి ప్రపంచ రికార్డు

ఏంటి ప్రత్యేకత..?

పద్యం రాస్తే ప్రపంచ రికార్డు ఏంటి అనుకుంటున్నారా.. ? ప్రణేశ్​ రాసింది అతిపెద్ద పద్యం మరి. 2 వేల 241 తులూ పదాలను ఉపయోగించి.. పేజీల కొద్దీ రాశాడు. ఇది కొలిస్తే 21 అడుగుల మేర ఉంటుందట. మొత్తం 108 పేరాలు, 432 లైన్లలో.. తన కవితా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

పేజీల కొద్దీ రాసిన పద్యం

పద్యంలో తులూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తన ప్రతిభకు సానబెట్టాడు ప్రణేశ్​. ఇంకా దైవారాధన, ఆధ్యాత్మిక కేంద్రాలు, తులూ పండుగలు, సాంస్కృతిక పోటీల ప్రాముఖ్యాన్ని వివరించాడు​.

తులునాద ఇసిరీ పద్యాన్ని చూపిస్తూ ప్రణేశ్​

ప్రణేశ్​ గతంలోనూ ఎన్నో తులూ పద్యాలు రాశాడు. తన బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.

అవార్డులతో ప్రణేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.