ETV Bharat / bharat

పట్టా పట్టిన యువతి.. కొబ్బరి చెట్లు ఎక్కుతూ!

కరోనా వేళ తండ్రికి సాయంగా నిలిచేందుకు కేరళలో ఓ యువతి వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. డిగ్రీ పట్టా పట్టినప్పటికీ మహిళపై సమాజంలో ఉన్న భావాలను పక్కకు నెట్టి.. తండ్రికి సాయంగా కొబ్బరి చెట్లు ఎక్కుతోంది. ఈ విధంగా చేయడానికి కారణం ఆమె తండ్రి అన్న ఒకే ఒక్క మాట. అదేంటో తెలుసా?

Malappuram Girl breaks notions; Takes up coconut tree climbing for a living
కరోనా కాలం: పట్టా పట్టిన యువతి.. కొబ్బరి చెట్లు ఎక్కుతూ
author img

By

Published : Jun 7, 2020, 7:37 AM IST

కరోనా కాలం: పట్టా పట్టిన యువతి.. కొబ్బరి చెట్లు ఎక్కుతూ

కరోనా కాలంలో విధించిన లాక్​డౌన్​తో ఎన్నో కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే కేరళ మలప్పురంలో బీఈడీ చదువుతున్న ఓ యువతి తన కుటుంబ పోషణ కోసం వినూత్న పద్దతిని ఎంచుకుంది. మహిళపై సమాజంలో ఉన్న భావాలను పక్కకు నెట్టేసి.. తన తండ్రితో కలిసి కొబ్బరి చెట్లను ఎక్కడం ప్రారంభించింది.

కాదంబుజా ప్రాంతంలో నివాసముంటున్న శ్రీదేవి బీఈడీ చివరి సంవత్సరం చదువుతోంది. తండ్రి గోపాలన్​ కొబ్బరి చెట్ల తోటలో కూలీ పని చేస్తున్నాడు. కొబ్బరి కాయలను కోస్తూ.. వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శ్రీదేవి.. లాక్​డౌన్​కు ముందు తండ్రికి చేయూతగా ఉండేందుకు ట్యూషన్​ క్లాసులు చెప్తుండేది. ఆంక్షల కారణంగా రెండు నెలలకు పైగా సంపాదన నిలిచిపోయింది. ఈ క్రమంలో.. భౌతిక దూరం పాటిస్తూనే పని చేయగల ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది శ్రీదేవి.

ఆ ఒక్కమాటతో...

ఒకరోజు తనకు కొడుకే ఉంటే కొబ్బరి చెట్లు ఎక్కేందుకు సాయపడేవాడని శ్రీదేవితో తన తండ్రి అన్నాడు. అంతే ఆ ఒక్క మాటతో ఎలాగైనా కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకోవాలనుకుందా యువతి. కఠోర దీక్ష పూని ఇప్పుడు తండ్రితో పాటు రోజూ కొబ్బరి కాయలను తెంపే పనికి వెళ్తోంది. రోజుకు 20కిపైగా చెట్లు ఎక్కుతోంది శ్రీదేవి. వచ్చే ఆదాయంతో తండ్రికి చేదోడుగా నిలుస్తోంది. ఆమె పట్టుదల చూసి ఎంతగానో గర్వపడుతున్నట్లు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన కుమార్తె ఈ విధంగా సాయం చేస్తుందని అసలు ఊహించలేదని శ్రీదేవి తండ్రి గోపాలన్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.