ETV Bharat / bharat

ఆవు పేడ పాద రక్షలతో ఆరోగ్యం సురక్షితం! - benefits of cow shit slippers

శరీర భారాన్నంతా మోసేవి పాదాలు.. మరి అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా మనమూ బాగుండేది. కానీ, వాటికి ప్లాస్టిక్​ వంటి హానికారక చెప్పులు ధరిస్తే.. పాదాల ఆరోగ్యం ఏమవుతుంది? అందుకే, ఆయుర్వేద గుణాలున్న ఆవు పేడతో పాదాలకు రక్షలు తయారు చేశాడు మహారాష్ట్ర కొల్హాపుర్​కు చెందిన ఓ చెప్పుల వ్యాపారి.

Kolhapur man manufactures footwear using cow dung
ఆవు పేడ పాద రక్షలతో.. ఆరోగ్యం సురక్షితం!
author img

By

Published : Jul 5, 2020, 2:23 PM IST

ఆవు పేడ పాద రక్షలతో ఆరోగ్యం సురక్షితం!

మహారాష్ట్ర కొల్హాపురీ తోలు చెప్పులంటే తెలియని వారుండరు. ఆ ఖ్యాతికి మరింత పేరు తెచ్చేలా ఓ వ్యాపారి ఆవు పేడతో చెప్పులు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

టోటల్ డ్రీమ్ సర్వీసెస్​ చెప్పుల పరిశ్రమ యజమాని కిరణ్​ మాలీ.. ఆవు పేడతో చెప్పులు తయారు చేస్తున్నాడు. వినూత్నంగా కనిపించే ఈ చెప్పులు పర్యావరణహితమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నాడు.

"మన శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు ఈ ఆవు పేడ చెప్పులు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ చెప్పులు నీటిలో తడిచినా పాడవ్వవు."

-కిరణ్​ మాలీ, పరిశ్రమ యజమాని

పేడను జల్లెడ పట్టి, అందులో సహజ నూనెలు కలిపి తయారు చేసిన ఈ చెప్పులకు 'గోమాత చరణ పాదుకాలు'గా నామకరణం చేశారు. ఒక్క జత సుమారు రూ.500 నుంచి రూ. 700 ధర పలుకుతున్నాయి. ఈ ఆవుపేడ చెప్పులకు భారత్​లోనే కాదు.. విదేశాల్లోనూ భారీ డిమాండ్​ ఉంది. అందుకే త్వరలో వీటిని ఎగుమతి చేసే యోచనలో ఉన్నాడు కిరణ్​.

ఇదీ చదవండి: పిడుగు పడిందని పేడలో మహిళ సజీవ సమాధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.