ETV Bharat / bharat

వజ్రాల మాస్క్​ పెట్టుకోవాల.. ప్రత్యేక ఆకర్షణగా నిలవాల! - diamond mask shop in surat

ఈ కరోనా కాలంలో ఒంటినిండా ఎన్ని నగలు ధరిస్తే ఏం లాభం..? ఆ నగలు ఫలానా వారు వేసుకున్నారని గుర్తించడానికి వీల్లేకుండా ముఖానికి మాస్క్ ఉన్నప్పుడు. అందుకే, ఆ మాస్కునే నగగా మార్చేస్తే పోలా అనుకుని ఇప్పటికే చాలా మంది.. వెండి, బంగారంతో రకరకాల ప్రయోగాలు చేశారు. తాజాగా గుజరాత్​​కు చెందిన ఓ నగల వ్యాపారి ఏకంగా వజ్రాల మాస్కాభరణాన్ని తయారు చేసేశాడు.

Jewellery shop in Surat selling diamond-studded masks worth lakhs
వజ్రాల మాస్క్​ పెట్టుకోవాల.. ప్రత్యేక ఆకర్షణగా నిలవాల!
author img

By

Published : Jul 11, 2020, 5:26 PM IST

కరోనా వేళ ముఖాన్ని కప్పేస్తున్న మాస్కునే ప్రత్యేక ఆకర్షణగా మార్చేశాడు గుజరాత్​కు చెందిన ఓ నగల వ్యాపారి. మాస్కుకు వజ్రాలు పొదిగి.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు.

Jewellery shop in Surat selling diamond-studded masks worth lakhs
వజ్రాల మాస్క్​ పెట్టుకోవాల.. ప్రత్యేక ఆకర్షణగా నిలవాల!

సూరత్​లోని కుషాల్​భాయి నగల దుకాణం యజమాని దీపక్​ ఛోక్సీ. కరోనా వేళ బంగారు, వెండి మాస్కులు సర్వసాధారణం అయిపోయాయనుకున్న ఓ కస్టమర్ దీపక్​ షాపుకొచ్చాడు. వారింట్లో జరుగుతున్న పెళ్లిలో.. వధూవరులు ధరించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో మాస్కులు​ కావాలని కోరాడు. అప్పుడే, దీపక్​కు ఈ ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. ఒక్కోటి సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఖరీదు చేసే డైమండ్​ మాస్క్​ల​ను తయారుచేసేశాడు.

"ఓ కస్టమర్​ ఇంట్లో పెళ్లి జరుగుతోంది . ఆయన మా షాపుకు వచ్చి.. వధూవరులకు ప్రత్యేకమైన మాస్కులు కావాలన్నారు. అప్పుడు మా డిజైనర్లకు చెప్పి వజ్రాల మాస్కు తయారు చేయించాను. ఆ మాస్కు బాగా నచ్చి, వచ్చిన కస్టమర్​ దానిని తీసుకెళ్లారు. ఆ తర్వాత, అలాంటి మాస్కులు మరిన్ని తయారు చేయించాను. వీటిని తయారు చేసేందుకు నాణ్యమైన వజ్రాలతో పాటు, అమెరికన్​ డైమండ్​, బంగారం ఉపయోగించాం."

- దీపక్​ ఛోస్కీ, నగల దుకాణం యజమాని

ఈ డైమండ్​ మాస్క్​ తయారీలో ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారమే... వస్త్రాన్ని వినియోగించి దానిపై వజ్రాలు పొదిగారు. ఈ డైమండ్ మాస్క్​ బోర్​ కొట్టినా, అవసరం లేదనిపించినా ఆ వజ్రాలను తీసేసి.. వేరే నగలు చేయించుకోవచ్చు అంటున్నారు దీపక్​.

ఇదీ చదవండి: మాస్కే బంగారమాయెనే..! ధరెంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.