దేశంలో మరో 78 వేల 524 కరోనా కేసులు.. 971 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 68 లక్షల మార్కు దాటాయి. ప్రస్తుతం 9 లక్షల 2 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.

భారత్లో కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకు 58 లక్షల 27 వేల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చారయ్యారు. రికవరీ రేటు 85.25 శాతానికి చేరింది. మరణాల రేటు 1.54 శాతానికి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

బుధవారం రోజు 11 లక్షల 94 వేలకుపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం టెస్టుల సంఖ్య 8 కోట్ల 34 లక్షలు దాటింది.
