ETV Bharat / bharat

భారత్​లో డబ్ల్యూహెచ్​ఓ సిఫార్సుల కంటే ఎక్కువ టెస్టులు.. - కరోనా న్యూస్ అప్​డేట్

దేశంలో కొత్తగా 74,442 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 66 లక్షలకు చేరింది. మరో 903 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 1,02,685కు చేరింది. మరోవైపు, దేశంలో టెస్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సిఫార్సు కన్నా అధికంగా కరోనా టెస్టులు జరుగుతున్నాయి.

COVID-19
కరోనా
author img

By

Published : Oct 5, 2020, 9:50 AM IST

Updated : Oct 5, 2020, 10:52 AM IST

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 74,442 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. మరో 903 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 66,23,816కు చేరింది. ప్రస్తుతం 9,34,427 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,02,685కు చేరింది.

డబ్ల్యూహెచ్​ఓ సిఫార్సు కన్నా ఎక్కువే

భారత్​లో కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పది లక్షల జనాభాకు రోజూ 828 టెస్టులు చేస్తున్నట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన(పది లక్షల జనాభాకు 140 టెస్టులు) దానికంటే ఆరు రెట్లు అధికంగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించింది.

పది లక్షల జనాభాకు దిల్లీలో అత్యధికంగా 2,717 టెస్టులు జరుగుతుండగా.. గోవాలో 1,319, కర్ణాటకలో 1,261 పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యల్పంగా రాజస్థాన్​లో 280 పరీక్షలు చేస్తున్నారు.

Last Updated : Oct 5, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.