ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: ఈ-వీసాలను నిలిపివేసిన భారత్​ - inidan embassy latest news

కేరళలో మరో కరోనా వైరస్​ కేసు నమోదు అయిన నేపథ్యంలో భారత్​ మరింత అప్రమత్తమైంది. తాజాగా చైనా నుంచి భారత్​కు రావాలనుకుంటున్న పర్యటకులకు ఈ-వీసా సదుపాయాన్ని ​తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

India temporarily suspends e-visa facility for Chinese and foreigners residing in China
కరోనా ఎఫెక్ట్​: ఈ-వీసాలను నిలిపివేసిన భారత్​
author img

By

Published : Feb 2, 2020, 4:57 PM IST

Updated : Feb 28, 2020, 9:49 PM IST

కరోనా ఎఫెక్ట్​: ఈ-వీసాలను నిలిపివేసిన భారత్​

చైనాలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్​లోనూ రెండో కేసు నమోదు అయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. చైనా నుంచి భారత్​కు వెళ్లాలనుకునే పర్యటకులకు ఈ-వీసాలను నిలిపివేసినట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

చైనావాసులు, డ్రాగన్ దేశంలోని విదేశీయులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రాయబార కార్యాలయం తెలిపింది. ఇప్పటికే జారీ చేసిన ఈ-వీసాలు ఇకపై చెల్లవని పేర్కొంది. ఎవరైనా బలమైన కారణంతో భారత్​ వెళ్లాలనుకుంటే తమను సంప్రదించాలని సూచించింది.

వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్​ నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో 654మందిని భారత్​కు తీసుకొచ్చారు. ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్​ 14,562మందికి సోకగా.. 300పైగా మంది మరణించారు. దాదాపు 25 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.