ETV Bharat / bharat

భారత్​ దూకుడు- చైనా సరిహద్దుకు భారీ ట్యాంకర్లు - india china border disputes

చైనాకు దీటుగా తూర్పు లద్దాఖ్ సరిహద్దులో బలగాలను పెంచింది భారత్​. భారీ ట్యాంకర్లను తరలించింది. దౌలత్​ బేగ్​ ఒల్దీ, దేప్​సంగ్ మైదానాల్లో 17వేలమంది సైనికులను మోహరించిన డ్రాగన్​ దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే బదులిచ్చేందుకు భారత్​ ఈ మేరకు చర్యలు చేపట్టింది.

India strengthens troop presence in northern Ladakh, does heavy tank deployment to tackle Chinese threat
తూర్పు లద్దాఖ్​లో బలగాల పెంపు​- హెవీ ట్యాంకర్ల మోహరింపు
author img

By

Published : Aug 3, 2020, 5:49 PM IST

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో భద్రతను మరింత పెంచింది భారత్​. దౌలత్​ బేగ్ ఓల్దీ(డీబీఓ), దేప్​సంగ్​ మైదానాల్లో భారీగా బలగాలను మోహరించింది. హెవీ ట్యాంకర్లను తరలించింది. చైనా సైన్యం కవ్విస్తే దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమైంది.

ఈ ప్రాంతాల్లో ఏప్రిల్​-మే నుంచి 17 వేల బలగాలను చైనా మోహరించింది. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. పెట్రోలింగ్​ పాయింట్​ 10, 13 పాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించడానికి వీల్లేకుండా అడ్డుకుంది.

ఈ నేపథ్యంలోనే చైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్​ కూడా 15వేలకు పైగా బలగాలు, భారీ ఆయుధ వాహనాలు మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒక వేళ చైనా తెగిస్తే మన చేతిలో చావు దెబ్బ తప్పని విధంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాయి.

డీబీఓ సెక్టార్​కు ఎదురుగా ఉన్న టీబడ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారాకోరం పాస్ ఏరియా వరకు రోడ్డు నిర్మించాలని భావిస్తోంది ఛైనా. అందుకే అక్కడి నుంచి సైనికులను ఉపసంహరించుకోవడంలేదు.

ఇదీ చూడండి: రామాలయ భూమిపూజ కార్యక్రమానికి శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.