ETV Bharat / bharat

'భారత సరిహద్దులు పూర్తి భద్రం, సురక్షితం' - Attari-Wagah border in Amritsar

భారత సరిహద్దులు పూర్తి భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని బీఎస్​, ఐటీబీపీ డైరెక్టర్​ జనరల్​ ఎస్​ఎస్​ దేశ్​వాల్ అన్నారు​. భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలిపారు. అట్టారీ- వాఘా సరిహద్దులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు దేశ్​వాల్.

India borders well protected, says top BSF official
'భారత సరిహద్దులు పూర్తిగా భద్రం, సురక్షితం'
author img

By

Published : Aug 15, 2020, 5:48 PM IST

భారత సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని బీఎస్​ఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ ఎస్​ఎస్​ దేశ్​వాల్​ అన్నారు​. సరిహద్దులు పూర్తిగా భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి దుస్సాహసాలనైనా తిప్పికొట్టేలా సిద్ధంగా ఉన్నామని దేశానికి భరోసా కల్పించారు.

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమృత్​సర్​లోని అట్టారి- వాఘా సరిహద్దులో జాతీయ జెండాను ఎగురువేశారు దేశ్​వాల్​. భద్రతా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు​. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకున్నారు.

"తన సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకుంటూ శాంతికాముకంగా వ్యవహరిస్తోంది భారత్​. తమ బలం, బలగంతో సరిహద్దులో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. మన సరిహద్దులు పూర్తిగా భద్రం, సురక్షితమని దేశానికి భరోసా ఇస్తున్నాం."

- ఎస్​ఎస్​ దేశ్​వాల్, బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ డైరెక్టర్​ జనరల్​

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా దేశం కోసం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల సేవలను కొనియాడారు దేశ్​వాల్​. పాకిస్థాన్​ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో ఆయుధాలతో సైన్యం సిద్ధంగా ఉందన్నారు.

ఇదీ చూడండి: అక్కడ 20 ఏళ్ల తర్వాత ఎగిరిన మువ్వన్నెల జెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.