కరోనా రోగులకు ఉన్న ప్రదేశాల్లోనే వైద్య చికిత్స అందించేలా వినూత్నంగా ఓ ఆసుపత్రిని రూపొందించింది మద్రాస్ ఐఐటీ ఇంక్యుబేషన్ స్టార్టప్-మాడ్యులస్ హౌసింగ్.
కొవిడ్ బాధితులకు ప్రత్యేకమైన వసతులతో కూడిన ఆసుపత్రి తప్పనిసరి. దీంతో పాటు బాధితులను గుర్తించడం దగ్గరి నుంచి వ్యాధికి చికిత్స అందించే వరకు అనేక ఇబ్బందుల తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితులకు అధిగమించేందుకు మద్రాస్ ఐఐటీ ఇంక్యుబేషన్ స్టార్టప్-మాడ్యులస్ హౌసింగ్ విన్నూతంగా ఆలోచించింది.
ఎక్కడి వారికి అక్కడే చికిత్స..
వ్యాధిగ్రస్తులను గుర్తించి ఎక్కడి వారికి అక్కడే చికిత్స అందించేందుకు అన్ని రకాల సదుపాయలు ఉండే మెడిక్యాబ్ ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఈ మెడిక్యాబ్లో వైద్యుని గది, ఐసోలేషన్, మెడికల్ గదితోపాటు ఐసీయూతో కూడిన 15 పడకలు ఉంటాయి. ఇందులో రోగిని గుర్తించే దగ్గర నుంచి పూర్తి చికిత్స అందించే వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
సంతోషంగా ఉంది!
ఇప్పటికే మెడిక్యాబ్ను కేరళలోని వయనాడ్లో ప్రారంభించగా దేశవ్యాప్తంగా ఈ మైక్రో ఆసుపత్రులను విరివిరిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కరోనాపై పోరులో తాము భాగస్వామ్యం అవుతన్నందుకు సంతోషంగా ఉందని ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి తమస్వతి ఘోష్ అన్నారు.
ఇదీ చూడండి: గుడ్ న్యూస్: తగ్గుతున్న యాక్టివ్ కేసులు