ETV Bharat / bharat

అపార జ్ఞాపకశక్తి.. ఈ చిచ్చరపిడుగు సొంతం - అద్వైత్​ సర్దేశ్​ముఖ

అద్వైత్​ సర్దేశ్​ముఖ... ఈ మూడేళ్ల పిల్లాడు ఇటీవలే ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నాడు. అపార జ్ఞాపకశక్తి ఇతడి సొంతం. ఖండాలు, రాష్ట్రాల పేర్లతో పాటు శ్లోకాలు, కవితలు, అంకెలు వంటివి అనర్గళంగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ కర్ణాటక వాసి.

Hubli boy's name added to India Book of Records
వావ్​ అద్వైత్​.. మూడేళ్లకే ఏం జ్ఞాపకశక్తి గురూ!
author img

By

Published : Sep 12, 2020, 4:18 PM IST

అపార జ్ఞాపకశక్తితో మూడేళ్ల వయసులోనే దుమ్మురేపుతున్నాడు కర్ణాటక హుబ్లీకి చెందిన చిచ్చరపిడుగు అద్వైత్ సర్దేశ్​ముఖ​. ఏడు ఖండాలు, దేశంలోని రాష్ట్రాలు-వాటి రాజధానులు, సౌరమండలంలోని గ్రహాల పేర్లను చెబుతూ ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​-2020లో స్థానం సంపాదించుకున్నాడు.

Hubli boy's name added to India Book of Records
ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​తో అద్వైత్​

సర్టిఫికెట్​, పతకం

అద్వైత్​ వయసు ఇప్పుడు 3ఏళ్ల 10నెలలు. రాష్ట్రాలలోని జిల్లాలు, కాలచక్రం, 20నక్షత్రాలు, కన్నడ-ఆంగ్ల భాషల్లో 1-100 నెంబర్లు, హిందీలో 1-50 నెంబర్లు, శ్లోకాలు, విష్ణుమూర్తి అవతారాలు, ఆంగ్ల కవితలు, కన్నడలోని చిన్న చిన్న కథలు, ప్రధానమంత్రితో పాటు వివిధ మంత్రుల పేర్లను చకచకా చెప్పేస్తుంటాడు ఈ బుడతడు.

అద్వైత్​ తల్లి శ్వేతా సర్దేశ్​ముఖ. ఆమె ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరు. తండ్రి వినాయక సర్దేశ్​ముఖ. ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇప్పుడు అద్వైత్​ ప్రతిభను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

మూడేళ్ల చిచ్చరపిడుగు

అద్వైత్​ పేరు మీద ఇప్పుడు ఓ యూట్యూబ్​ ఛానల్​ కూడా ఉంది. ఈ చిచ్చరపిడుగు పాటలు కూడా పాడతాడు, పెయింటింగ్​ కూడా చేయగలడు.

ఇదీ చూడండి:- 11 ఏళ్ల వయస్సులోనే ఆ బాలిక అరుదైన ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.