ETV Bharat / bharat

ఆయన చెవిలో మారుమోగుతున్న 253 విదేశీ రేడియోలు! - Babul Gupta of Barasat DXing

మీకు రేడియో వినే అలవాటుందా? అయితే, ప్రయాణల్లో రేడియో ప్రసారాలు వింటున్నప్పుడు సిగ్నల్స్ పోతూ వస్తూ ఉండడం గమనించే ఉంటారు. నగరాలకు దూరంగా వెళ్లే కొద్ది ఆ ఛానల్ తరంగాలు మన చెవికి దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని రేడియో ఛానళ్ల స్టేషన్లు మన దేశంలోనే ఉన్నా.. వాటి సిగ్నళ్లు ఒక్కోసారి మనదాకా అందవు. కానీ, బంగాల్​కు చెందిన ఓ పెద్దాయన మాత్రం ఏకంగా వివిధ దేశాలలోని 253 రేడియో స్టేషన్ల ప్రసారాలను రోజూ వింటున్నారు. అదెలా సాధ్యమైందో చూసేద్దాం రండి...

From Bengal to Antarctica, 253 radio stations come live here
ఆయన చెవిలో మారుమోగతున్న 253 విదేశీ రేడియోలు!
author img

By

Published : Sep 28, 2020, 3:38 PM IST

అరుదైన 'డీజింగ్' అలవాటుతో దాదాపు 253 విదేశీ రేడియో ప్రసారాలను వింటున్నారు బంగాల్, ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన ఓ పెద్దాయన.

ఉత్తర 24 పరాగణాలు, సుబర్ణపట్టణ్ ప్రాంతానికి చెందిన బాబుల్ గుప్తా (64)కు డీజింగ్ అలవాటుంది. అంటే, సుదూర రేడియో, టీవీ ప్రత్యక్ష ప్రసారాలను ఎలాగైనా వినాలని తపించే అలవాటన్నమాట. ఇందుకోసం ఓ గదిని మినీ రేడియో స్టేషన్​గా మార్చేశారు. మేడ మీద బోలెడు యాంటీనాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వింత అలవాటుతోనే ప్రపంచంలోని దాదాపు 253 రేడియో స్టేషన్ల తరంగాలను వెతికిపట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అంటార్కిటికా రేడియో ఛానల్ సైతం బాబుల్ యాంటీనాకు చిక్కింది.

From Bengal to Antarctica, 253 radio stations come live here
బాబుల్ రేడియో గది

ఎలా అలవాటైందంటే...

ఎక్కడో విదేశాల్లో ప్రసారమయ్యే రేడియో కార్యక్రమాలను వినాలనే తపన తమకు ఎందుకు కలిగిందని అడిగితే... 1968లో తనకు ఎదురైన ఓ సంఘటనను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు బాబుల్.

ప్రపంచ రేడియో స్టేషన్లతో అనుసంధానం

"నాకప్పుడు 12 ఏళ్లు. ఓ రోజు వార్తా పత్రిక చదువుతున్నప్పుడు.. మెల్బోర్న్ ఒలంపిక్ క్రీడా కార్యక్రమం ఆ దేశ రేడియో బ్రాడ్ కాస్ట్ లో ప్రసారమవుతుందనే వార్త చూశాను. ఆ రోజు మా నాన్న రేడియో పట్టకుుని ఆ కార్యక్రమం వినాలని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ, పత్రికలో వచ్చిన ఆ ఛానల్ సిగ్నల్ అందలో దొరకలేదు. యాంటీనాలను మార్చి సిగ్నల్ కోసం బాగా ప్రయత్నించాను. చివరికి.. మెల్బోర్న్ రేడియో స్టేషన్ సిగ్నల్ అందింది. అప్పటి నుంచి, వివిధ దేశాల రేడియో తరంగాలను వెతుక్కుంటూ వినేవాడిని."

-బాబుల్ గుప్తా

బాబుల్ జేబు ఖర్చులకు ఇచ్చే డబ్బును దాచుకుని.. సిగ్నల్​ను గ్రహించే యాంటీనాలు కొనేవారు. యాంటీనాల సాయంతో రష్యా , అమెరికా, జపాన్, బ్రిటన్, ఐరోపా వంటి దేశాల్లో ప్రసారమయ్యే రేడియో కార్యక్రమాలను వినగలుగుతున్నారు. ఇలానే ప్రయత్నించి అంతరిక్షంలోని రేడియో ప్రసారాలనూ వింటానంటున్నారు బాబుల్.

"ఏదో ఓ రోజు నేను అంతరిక్షం నుంచి ప్రసారమయ్యే రేడియో కార్యక్రమాలను వింటాను. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. డీజింగ్ చేయడానికి ఆ దేశాల నుంచి అనుమతి పొందనక్కర్లేదు. అయితే, వాటిని ఉపయోగించి నాలా హెచ్ఏఎం రేడియోలను ప్రారంభించడానికి మాత్రం అనుమతి పొందాలి."

- బాబుల్ గుప్తా

తన అరుదైన అలవాటకు భార్య కుమారుల నుంచి పూర్తి సహకారమందుతోంది అంటున్నారు బాబుల్.

" పెళ్లయిన కొత్తలో మా ఆయన వింత అలవాటుకు నేను కాస్త ఇబ్బందిపడ్డాను. రాత్రింబవళ్లు ఆయన ఆ గదిలోనే ఉంటూ.. రేడియో సిగ్నళ్ల కోసం ప్రయత్నించేవారు. కానీ, మెల్లిగా ఆయన అలవాటును అర్థం చేసుకున్నాను. మా కుమారుడు కూడా ఈ మధ్య తండ్రిలాగే విదేశీ రేడియో సిగ్నళ్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. "

- అపర్ణ, బాబుల్ సతీమణి

ఇదీ చదవండి: దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.