ఉత్తర్ప్రదేశ్ ఆజంగఢ్లో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందాడు. మరో పైలట్ గాయపడ్డాడు. 11:30 గంటలకు ఈ ఘటన జరిగింది.
నలుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ శిక్షణ విమానం ఐజీఆర్యూఏకి చెందిందని అధికారులు తెలిపారు. విమానం కూలి వ్యవసాయ క్షేత్రంలో పడినట్లు చెప్పారు.