కరోనా మహమ్మారికి సంబంధించిన చిత్రాలను తొలిసారి విడుదల చేశారు భారత శాస్త్రవేత్తలు. పుణెలోని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)-ఎన్ఐవీ శాస్త్రవేత్తల బృందం.. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ సాయంతో కొవిడ్-19 ఆకృతిని గుర్తించగలిగింది. ఈ చిత్రాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్‌లో ప్రచురితమయ్యాయి.
ఈఏడాది జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ వ్యక్తి గొంతులోనుంచి సేకరించిన నమూనాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు సార్స్-కోవ్-2 (కొవిడ్-19) చిత్రాలను కనుగొన్నారు.
భారత్‌లో గుర్తించిన వైరస్ జన్యు నమూనాలు వుహాన్‌కు చెందిన వైరస్ జన్యువుతో 99.98 శాతం మేర పోలివున్నట్లు పరిశోధనలో తేలింది.
ఇదీ చూడండి: దేశంలో 900 దాటిన కరోనా కేసుల సంఖ్య