ETV Bharat / bharat

లైవ్​ వీడియో: పెట్రోల్​ నింపుతుండగా అంటుకున్న మంటలు

ఛత్తీస్​గఢ్​ బెమెతరా జిల్లాలోని ఓ పెట్రో​ల్​ బంకులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ద్విచక్ర వాహనంలో పెట్రోలు నింపుతున్న సమయంలో ఆకస్మాత్తుగా ట్యాంకు నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేశారు.

Fire in bike tank while putting petrol
బైక్​ ట్యాంకు నుంచి మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Jul 28, 2020, 1:20 PM IST

ఛత్తీస్​గఢ్ బెమెతరా జిల్లాలోని ఓ పెట్రోల్​ బంకులో ఓ ద్విచక్ర వాహనంలో పెట్రోలు నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెట్రోలు బంకు సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

బైక్​ ట్యాంకు నుంచి మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

ఇదీ జరిగింది!

దూర ప్రయాణం చేసి వచ్చిన ఓ వ్యక్తి... బైక్​లో పెట్రోలు నింపడానికి నవాగఢ్ పట్టణంలోని జైస్వాల్ పెట్రోల్​ బంకు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పెట్రోలు నింపుతున్నప్పుడు ట్యాంకు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అందుబాటులో ఉన్న కార్బన్ ​డై ఆక్సైడ్​తో మంటలను అదుపు చేశారు. దీంతో ఘటనాస్థలంలో ఉన్నవారు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ బైక్​ ఎండలో ప్రయాణించి రావడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

ఇదీ చూడండి: వరద ధాటికి కూలిన వంతెనలు.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.