గుజరాత్ అహ్మదాబాద్‌లోని శ్రేయ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐసీయూ వార్డ్‌లో ఉన్న మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
40 మంది రోగులను రక్షించి నగరంలోని మరో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రధాని దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేలు ఇవ్వనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కొరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
ఘటనపై రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ దర్యాప్తునకు ఆదేశించారు. మూడు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు.