ETV Bharat / bharat

'సీబీఎస్​ఈ' చొరవ.. వికాస కేంద్రాలుగా విద్యాలయాలు

విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో పాఠశాలది కీలకపాత్ర. నేటితరం విద్యార్థులు విద్యనభ్యసించే క్రమంలో అధిక ఒత్తిడికి లోనవుతుండడం తెలిసిందే. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను మార్చేందుకు ముందడుగు వేసింది సీబీఎస్​ఈ. బోధనలో గుణాత్మక మార్పులు చేపడుతూ.. ఇటీవల తమ పరిధిలో గల పాఠశాలలకు నూతన విధానం అమలు చేసేందుకు పునాదులు వేసింది. మరి నూతన మార్గదర్శకాలను చేపట్టే ఆ విద్యావిధానం ఎలా ఉంటుందో ఓసారి చదివేయండి.

Education departments as Development Centers
సీబీఎస్​ఈ ప్రశంసనీయ చొరవ
author img

By

Published : Feb 20, 2020, 8:10 AM IST

Updated : Mar 1, 2020, 10:15 PM IST

బోధన ఎంతో బాధ్యతతో కూడుకున్న ప్రక్రియ. జ్ఞానం, విలువలు, సంస్కృతి నేర్పించే పాఠశాల వాతావరణం అత్యుత్తమంగా, అహ్లాదభరితంగా ఉండాలన్న ఆలోచనతో సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌) తమ పరిధిలోని స్కూళ్లను గుణాత్మకంగా మార్చివేయాలని తీర్మానించింది. పాఠశాలలను ఆనందమయ అభ్యసన కేంద్రాలుగా, సమగ్ర ఆరోగ్య వికాస స్థలాలుగా, కోపానికి తావులేని ప్రశాంత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పరిపూర్ణ విద్యాభ్యాసానికి విద్యార్థులు మానసికంగా సురక్షితంగా ఉండాలని; ముఖ్యంగా వారు ఇంటిపని (హోంవర్క్‌), గణితం, సామాన్యశాస్త్ర (సైన్స్‌) పఠనంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆనందమయమైన అభ్యసన వాతావరణం, సంతోషకరమైన తరగతి గది అద్భుతాలను సృష్టించగలవనడంలో అనుమానం లేదు. ఆ క్రమంలో సీబీఎస్‌ఈ చొరవ బహుధా శ్లాఘనీయం.

మార్గదర్శకాలివే...

కోప ఛాయలు లేని ప్రాంతాలుగా పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ కొన్ని మార్గదర్శకాలు చేసింది. విద్యార్థులతో సహజ మందహాస వదనంతో వ్యవహరించడం, వారితో హృదయ పూర్వకంగా సంభాషించడం, పిల్లలతో ప్రాణాయామం చేయించడం, చరవాణి వినియోగాన్ని పరిమితం చేయడం, ఏకాగ్రత కోసం రోజుకు కనీసం 20 నిమిషాలు ప్రత్యేకించడం వంటివి చేయాలని సీబీఎస్‌ఈ తన ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలలో మానసిక పూర్ణత్వం, చురుకుదనం అలవరుచుకున్న విద్యార్థులు ఇంటి వద్ద తమ ప్రవర్తనతో కుటుంబసభ్యుల ఆలోచనలో మార్పు తీసుకురాగలరు. వారిలో సంతోషం నింపి మరుసటిరోజు తిరిగి పాఠశాలకు ఆనందంగా వస్తారు. విద్యార్థులు మానసిక స్థిరత్వం కోల్పోయి, కోపతాపాలకు లోనవడానికి; ఇంట్లోనూ, బడిలోనూ సరైన అభ్యసన వాతావరణం లేకపోవడమే ముఖ్యమైన కారణం.

అందుకే 'పరీక్షా పే'

బోర్డు’ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి మోదీ దిల్లీలో ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమం నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన రెండు వేలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమక్షంలో క్లిష్ట సమయాల్లో పరిణతితో ఎలా వ్యవహరించాలో ఆయన వివరించారు. చరవాణుల దుష్ఫలితాలను గుర్తించిన ప్రధాని సాంకేతికత మన గుప్పిట్లో ఉండాలి తప్ఫ.. దాని అదుపులోకి మనం వెళ్ళకూడదని చేసిన వ్యాఖ్యలు గుర్తుంచుకోదగినవి.

ఒత్తిడి.. ఒత్తిడి...

కౌమారదశలో విద్యార్థులకు తగిన నిద్ర ఉండటం లేదని, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతూ- ఊబకాయం వంటి సమస్యల బారినపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో విద్యార్థుల శారీరక, మానసిక సమస్యల అధ్యయనానికి, పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాలున్నాయి. మారుతున్న జీవన విధానం భారతీయ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తోంది. కల్తీ ఆహార పదార్థాల వినియోగం కారణంగా కౌమార ప్రాయంలోని పిల్లలు శారీరక, మానసిక సంతులనం కోల్పోతున్నారు. చిన్నచిన్న సంఘటనలకు పాఠశాల విద్యార్థులు అసహనానికి గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్నాయి.

సీబీఎస్​ఈ సూచనలు

ఆరోగ్యకర అభ్యసన కోసం అన్ని తరగతుల పాఠ్యాంశాలలోనూ యోగా, క్రీడలు, కళలలను అనుసంధానించాలని ‘సీబీఎస్‌ఈ’ సూచించింది. ప్రతి పాఠశాలలోనూ అమలు చేయాల్సిన అయిదు సూత్రాలను అది వివరించింది. ‘ఇది కోపం లేని ప్రాంతం’ అని నోటీసు బోర్డులో ఉంచడం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తీసుకోండి అని అక్కడక్కడా బోర్డులు ఏర్పాటు చేయడం; క్రీడలు, కళలను ప్రోత్సహించాలని, వ్యాయామం చేయడం తప్పనిసరి అని బోర్డులు పెట్టడం; యాష్‌టాగ్‌ (hash tag) ద్వారా తమ పాఠశాలలను కోపానికి తావులేని విద్యాలయాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడం; స్థానిక అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం వంటివి అనుసరించాల్సిన విధివిధానాలుగా సీబీఎస్‌ఈ పేర్కొంది.

గృహ వాతావరణ ప్రభావమే అధికం...

జ్ఞాన సముపార్జనతో మానసిక, శారీరక ఆరోగ్య కేంద్రాలుగా వికసించాల్సిన విద్యాలయాలు- విధి నిర్వహణలో దారితప్పితే దేశ ప్రజల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలపై ఆ ప్రభావం పడుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కేవలం విద్యాలయాలు మాత్రమే బాధ్యత వహించవు. విలువలతో కూడిన వ్యక్తిత్వానికి విద్యాలయాలకంటే గృహ వాతావరణమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఉత్తమ మానవ సంబంధాలు కలిగి ఉండటమే నిజమైన విద్య అన్నది ఆధునిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. చదువుకునే దశలోనే విద్యార్థులు అనేక కారణాలతో మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. సరైన విషయ పరిజ్ఞానం సంపాదించలేక, నైపుణ్యాల కొరతతో అత్యధిక శాతం విద్యార్థులు దేశంలోని పాఠశాలలు, కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు.

ఒత్తిడిలేని విద్యే అంతిమ ప్రయత్నం...

ఒత్తిడిలేని విద్యను అందించేందుకు తెలుగు రాష్ట్రాలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. నూతన విద్యా పద్ధతులపై తెలంగాణ ప్రభుత్వం చురుకుగా అధ్యయనం ప్రారంభించింది. ప్రాథమిక పాఠశాలల్లో నిరుడు ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధనకన్నా బొమ్మలు, సృజనాత్మక విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అభ్యసన మొదలు పెట్టారు. ఈ ఏడాది నుంచి ఈ పద్ధతులను అయిదో తరగతి వరకూ విస్తరిస్తున్నారు. విద్యావ్యవస్థలో మార్పులకు తల్లితండ్రుల ఆలోచనలూ తోడుకావాలి. అప్పుడే సరైన ఫలితాలు సాధ్యమవుతాయి. ఆహ్లాదకరమైన గృహ వాతావరణం కల్పించి- తమ బిడ్డలను ఉత్తమ విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తే విద్యావ్యవస్థలో అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి.

- డాక్టర్​ గుజ్జు చెన్నారెడ్డి (రచయిత - సహాయ ఆచార్యులు, నాగార్జున విశ్వవిద్యాలయం)

ఇదీ చదవండి: ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్​వి ఇవే..

Last Updated : Mar 1, 2020, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.