కాశీ.. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటి. రుగ్వేదంలోనూ కాశీ ప్రస్తావన ఉందని చెబుతారు. మోక్షం ప్రసాదించే నగరంగానూ కాశీకి పేరు. మహాశివుడు సృష్టి ప్రారంభానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారనీ అంటారు. కాశీలో తుదిశ్వాస విడిచినవారికి మోక్షం ప్రాప్తిస్తుందని నమ్మిక. అక్కడి చేత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉంది పిశాచ్‌మోచన్‌కుండ్. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదేవతల ఆత్మలకు విముక్తితో పాటు అకాలమరణం చెందిన వారికీ ముక్తి లభిస్తుందని చెబుతారు.
''పిశాచ్‌మోచన్‌కుండ్‌గురించి గరుడపురాణం, స్కంధపురాణం, కాశీఖండం గ్రంథాల్లోనూ ప్రస్తావన ఉంది. వాల్మీకి మహర్షి ఇక్కడ నివసించేవారు. ప్రజలు పిశాచి అని పిలిచే ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన దానం స్వీకరించేవాడు గానీ ఇచ్చేవాడు కాదట. మనసంతా కల్మషంతో నిండి ఉండేది. మరణం తర్వాత మోక్షం సిద్ధించలేదు. ముక్తి కోసం వాల్మీకి వద్దకు వెళ్లగా... ఈ కొలనులో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని చెబుతాడు. మహాశివుడిని ప్రార్థించి, అక్కడ స్నానం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి ముక్తి లభిస్తుంది. అప్పటి నుంచి దీనిపేరు పిశాచ్‌మోచన్‌కుండ్‌గా స్థిరపడిపోయింది.'
- ప్రొ.అమిత్ శుక్లా, జ్యోతిష శాస్త్ర విభాగాధిపతి, సంపూర్ణానంద్ సంస్కృతి పాఠశాల
కాశీఖండ్‌గ్రంథం ప్రకారం గంగానది భూమి మీదకు రాక మునుపే ఇక్కడ ఈ కొలను ఉంది. ఓ పురాతనరావి చెట్టు ఇక్కడ ఉంటుంది. భూత, ప్రేతాలు, బాధలతో సతమతమయ్యే వారిని ఈ చెట్టు కింద కూర్చోబెడతారు.
''ఈ చెట్టుకు నాణేలు అతికిస్తే.. ఆర్థికకష్టాలు తొలగిపోతాయని చెబుతారు. మోక్షమార్గంలో ఎలాంటి అవరోధాలు ఎదురుకావు.''
- ప్రొ.అమిత్ శుక్లా, జ్యోతిష శాస్త్ర విభాగాధిపతి, సంపూర్ణానంద్ సంసృతి పాఠశాల
''గయాకు వెళ్లేకంటే ముందు.. పిశాచ్‌మోచన్‌కుండ్‌కు వస్తాం. మొదటి తర్పణం ఇక్కడ పూర్తైన తర్వాతే మేం గయాకు వెళ్తాం.'
- ప్రొ. ఉమాశంకర్ శుక్లా, సంపూర్ణానంద్ సంస్కృతి పాఠశాల
పిశాచ్‌మోచన్‌కుండ్‌వద్ద.. అశాంత ఆత్మల మేలు కోసం, బ్రాహ్మణులు పూజలు చేస్తారు. ఫలితంగా చనిపోయినవారి ఆత్మలు శాంతించి, ఇతరులను ఇబ్బంది పెట్టవని చెప్పుకుంటారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ