ETV Bharat / bharat

దిల్లీ నుంచి గల్లీ దాకా నిజాముద్దీన్​ కల్లోలం! - delhi nizamuddin marcuz event spritual gathering

ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న తరుణంలో దేశంలోనూ కల్లోలం పెరగడానికి నిజాముద్దీన్ పరిణామాలు కారణమయ్యాయి. దిల్లీ నుంచి గల్లీ దాకా దీని ప్రభావం ఉంది. తెలంగాణలో కేసులు వెలుగుచూశాక కేంద్రం అప్రమత్తమైంది. తబ్లీగీ జమాత్‌కు హాజరైన 303 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర హోం శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రార్థనలో పాల్గొన్నవారి ఆచూకీపై దేశవ్యాప్తంగా అన్వేషణ కొనసాగుతోంది.

delhi nizamuddin marcuz event spritual gathering
దిల్లీ నుంచి గల్లీ దాకా
author img

By

Published : Apr 1, 2020, 6:35 AM IST

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కల్లోలం పెరిగిపోవడానికి కారణమైన నిజాముద్దీన్‌ మర్కజ్‌ పరిణామాలు వివిధ శాఖల్ని కుదిపేస్తున్నాయి. కరోనా (కొవిడ్‌-19) కేసులు ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలోనూ పెద్దఎత్తున విదేశీయులు, మన దేశానికి చెందిన అనేక రాష్ట్రాల వారు రోజుల తరబడి ఒకేచోట ఉండడం, వారిపై ఎలాంటి పరిశీలన లేకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమని బలంగా వినవస్తోంది. ఈ మొత్తం ఉదంతంపై మంగళవారం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ స్థాయిల్లో వైఫల్యాలు చివరకు అనేక రాష్ట్రాల్లో కరోనా విజృంభణకు కారణంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలో మరణాలతో అప్రమత్తం

దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారికి కొవిడ్‌19 సోకినట్లు తెలంగాణలో వెలుగులోకి రావడం వల్ల అప్రమత్తమైనట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆ సంస్థ కార్యకర్తలకు సంబంధించిన వివరాలను ఆ వెంటనే రాష్ట్రాలకు పంపి అప్రమత్తం చేసినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన 824 మంది వివిధ రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారని, ఇప్పుడు వారందర్నీ గుర్తించి క్వారంటైన్‌కు పంపే కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించింది. సోమవారం దిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ నుంచి దాదాపు వెయ్యిమంది కార్యకర్తలను ఆసుపత్రులకు తరలించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తెలంగాణలో మరణాలతో ఈ అంశం తీవ్ర రూపు సంతరించుకుంది.

delhi nizamuddin marcuz event spritual gathering
ఏయే రాష్ట్రానికి ఎంతమంది తబ్లీగీలు

అంతమంది ఎలా ఉన్నారు?

లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఒకే ప్రాంగణంలో వెయ్యిమంది ఎలా ఉన్నారు? అధికారులు ఎలా ఉండనిచ్చారన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను వివరిస్తూ అటు తబ్లీగీ జమాత్‌, ఇటు కేంద్ర హోంశాఖ వివరణలు ఇచ్చాయి. హోంశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఖాళీ చేయించిన వారిలో 303 మందికి వైరస్‌ లక్షణాలున్నట్లు తెలుస్తోందని, అందులో 24 మందికి ఇప్పటికే పాజిటివ్‌ అని తేలిందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలతో సంబంధం ఉండి, ఇటీవల దిల్లీకి వెళ్లి వచ్చిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ గుర్తించి, వారికి వైద్య పరీక్షలు చేయించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించే బాధ్యతలను డీజీపీలకు అప్పగించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

10 రోజుల క్రితమే రాష్ట్రాలకు సమాచారం

రాష్ట్రాల్లో పనిచేస్తున్న 824 మంది విదేశీ కార్యకర్తల వివరాలను మార్చి 21న ఆయా రాష్ట్ర పోలీసులకు పంపించారు. వారిని గుర్తించి, వెంటనే వైద్యపరీక్షలు జరిపి క్వారంటైన్‌కు పంపాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

  • స్థానిక కో-ఆర్డినేటర్ల ద్వారా భారతీయ తబ్లీగీ జమాత్‌ కార్యకర్తల పేర్లు కూడా సేకరించాలని అన్ని రాష్ట్రాల పోలీసులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి వారందర్నీ గుర్తించి, వైద్య పరీక్షలు జరిపి క్వారంటైన్‌కు పంపాలని చెప్పారు. ఇప్పటివరకూ 2,137 మందిని విభిన్న రాష్ట్రాల్లో గుర్తించారు. అందరికీ పరీక్షలు జరిపి క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఇంకొంత మందిని గుర్తించాల్సి ఉంది. ఈ అంశంపై మార్చి 28న కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతోపాటు, దిల్లీ పోలీసు కమిషనర్‌కు సమాచారం పంపింది.
  • మార్చి 28, 29 తేదీల్లో వరుసగా డీజీపీలకు అడ్వయిజరీలు పంపి వారి రాష్ట్రాల్లో ఉన్న తబ్లీగీ కార్యకర్తల కదలికలన్నీ గుర్తించాలని ఆదేశించారు. వారు ఎవరెవర్ని కలిశారన్నది నిర్ధారించుకుని అందరికీ వైద్య పరీక్షలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ పని ప్రారంభించాయి.
    delhi nizamuddin marcuz event spritual gathering
    దిల్లీ నుంచి గల్లీ దాకా

ఫిబ్రవరి 1 నుంచి వివరాల చేరవేత

అంతర్జాతీయ ప్రయాణికులు ఇచ్చిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా కొవిడ్‌-19 ప్రభావిత దేశాలనుంచి వచ్చిన వారి వివరాలను ఫిబ్రవరి 1 నుంచి ‘బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌’ అన్ని రాష్ట్రాలకు అందిస్తూ వచ్చింది.

దీనికి తోడు మార్చి 6 తర్వాత విదేశాలనుంచి వచ్చే భారతీయులు, విదేశీయులందరి వివరాలను బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ వారు అన్ని రాష్ట్రాలకూ పంపుతూ వచ్చారు. పాస్‌పోర్టులో ప్రయాణికులు ఇచ్చిన శాశ్వత చిరునామా ఆధారంగా ఈ సమాచారాన్ని అందజేశారు. విదేశీయులైతే వారు భారతదేశంలో ఉండే హోటళ్ల వివరాలను రాష్ట్రాలకు అందజేశారు.

బయటకు తరలించే ప్రక్రియ పూర్తి

హజ్రత్‌ నిజాముద్దీన్‌ మర్కజ్‌లో చిక్కుకుపోయిన వారందరికీ మార్చి 26 నుంచి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 1,203 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. అందులో 303 మందికి కొవిడ్‌-19 లక్షణాలు కనిపించడం వల్ల వారందర్నీ దిల్లీలోని వివిధ ఆసుపత్రులకు పంపారు. మిగిలినవారిని దిల్లీలోని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. ఈ ప్రక్రియ మంగళవారమూ కొనసాగింది. సాయంత్రానికి నిజాముద్దీన్‌ మర్కజ్‌ నుంచి అందర్నీ బయటికి తరలించే ప్రక్రియ పూర్తయింది.

లాక్‌డౌన్‌ కారణంగానే వెయ్యిమంది ఇరుక్కుపోయారు: జమాత్‌

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగానే మర్కజ్‌ నిజాముద్దీన్‌ ప్రాంగణంలో దాదాపు వెయ్యిమంది సందర్శకులు నిలిచిపోవాల్సి వచ్చిందని తబ్లీగీ జమాత్‌ సంస్థ తెలిపింది. వారందర్నీ స్వస్థలాలకు పంపించేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదని ఆరోపించింది. మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. ప్రార్థనలకు వచ్చినవారిలో దాదాపు 1,500 మంది వాహనాల్లో స్వస్థలాలకు వెళ్లిపోయారని, లాక్‌డౌన్‌ కారణంగా వెయ్యిమంది అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆశ్రయం కల్పించామని చెప్పింది. మర్కజ్‌ ప్రాంగణాన్ని మూసివేయాలని పోలీసులు గత నెల 24న తాఖీదులిచ్చారని.. అందులో ఉన్న వారిని స్వస్థలాలకు పంపేందుకు వీలుగా వాహన పాసులివ్వాలంటూ చేసిన విజ్ఞప్తిని మాత్రం మన్నించలేదని వివరించింది.

నిజాముద్దీన్​కు ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది?

ఫిర్యాదును పట్టించుకోలేదు: స్థానికులు

కరోనా తీవ్రత పెరిగిన తర్వాత కూడా ఒకేచోట వందల మంది ఉంటున్న విషయాన్ని స్థానిక అధికారులకు, పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదని పశ్చిమ నిజాముద్దీన్‌ నివాసుల సంక్షేమ సంఘం కార్యదర్శి షేక్‌ మహమ్మద్‌ ఉమర్‌ ఆరోపిస్తున్నారు. ఎంతమంది అధికారులకు రాతపూర్వకంగా చెప్పినా కాలనీ భద్రతను పట్టించుకోలేదని చెప్పారు. యావత్‌ ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలోనూ 300 మంది విదేశీయులను దేశంలోకి ఎలా అనుమతించారని స్థానిక నేత ఫర్హాద్‌ సూరి ప్రశ్నించారు. నిషేధాజ్ఞల ఉల్లంఘనను ఏ యంత్రాంగమూ పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

  • ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకూ తబ్లీగీ కార్యకలాపాల కోసం వచ్చిన విదేశీయులు : దాదాపు 2,100
  • మార్చి 21 నాటికి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినవారు : 824
  • నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉన్నవారు : 216
  • మిగతావారు ఎక్కడున్నారు?: లాక్‌డౌన్‌ ప్రకటించకముందే దేశంలోని విభిన్న ప్రాంతాలకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
  • ఏయే దేశాల నుంచి వచ్చారు?: ఇండోనేషియా (72 మంది), మలేషియా (20), థాయిలాండ్‌ (7), నేపాల్‌ (9), మయన్మార్‌ (33), బంగ్లాదేశ్‌ (9), శ్రీలంక (34), కిర్గిస్థాన్‌ (28) తదితర 16 దేశాల నుంచి..

వీసా నిబంధనలు ఉల్లంఘించారా?

‘‘తెలంగాణలో తబ్లీగీ జమాత్‌ కార్యకర్తలకు కొవిడ్‌-19 సోకినట్లు తెలిసిన వెంటనే మార్చి 21 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు సంబంధించిన దేశ, విదేశీ కార్యకర్తల వివరాలను అన్ని రాష్ట్రాలకూ పంపింది. వీరిని గుర్తించి అందులో పాజిటివ్‌గా తేలిన వారిని క్వారంటైన్‌లకు పంపే కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేశాం. దీనిపై మార్చి 28, 29 తేదీల్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు అడ్వయిజరీలు వెళ్లాయి. ఆలోపు దిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉన్న కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ఇప్పటి వరకూ 1,339 మందిని దిల్లీలోని వేర్వేరు ఆసుపత్రులకు, హరియాణాలోని ఎయిమ్స్‌కి తరలించాం. మిగిలినవారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. తబ్లీగీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి విదేశీయులు సాధారణంగా పర్యాటక వీసాల మీద వస్తున్నారు ఇలా వచ్చేవారు ఎలాంటి మిషనరీ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారికి ఎలాంటి వీసాలు ఉన్నాయన్నది రాష్ట్ర పోలీసులు పరిశీలిస్తున్నారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

ఇదీ వీరి కథాకమామీషు

  • తబ్లీగీ జమాత్‌ కార్యకర్తల్లో విదేశీయులు, భారతీయులున్నారు. వీరు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా జరిగే కార్యకలాపాల్లో పాల్గొంటుంటారు.
  • వేర్వేరు దేశాల నుంచి వచ్చేవారంతా తమ రాక గురించి సాధారణంగా దిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌లో ఉన్న బంగెవాలి మసీదుకు సమాచారం అందిస్తారు. దేశంలో ఎక్కడెక్కడికి వెళ్లి కార్యకలాపాలు నిర్వహించాలన్నది ఇక్కడి నుంచే చెబుతారు.
  • ఈ కార్యకలాపాలను అన్ని రాష్ట్రాల్లో జిల్లా సమన్వయకర్తలు పర్యవేక్షిస్తుంటారు. కొన్ని రాష్ట్రాల్లో అమీర్లు చూస్తారు.
  • మార్చి 21 నాటికి 1746 మంది హజ్రత్‌ నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉన్నారు. అందులో 216 మంది విదేశీయులుకాగా, మిగిలిన 1530 మంది భారతీయులు.
  • అదే తేదీ నాటికి మరో 824 మంది విదేశీయులు దేశవ్యాప్తంగా విభిన్నరాష్ట్రాల్లో తబ్లీగీ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్నారు.
  • వీరికితోడు భారతదేశానికి చెందిన తబ్లీగీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఈ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

ఇదీ చదవండి: 'తక్షణమే వారందరిని గుర్తించి.. క్వారంటైన్​ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.