ETV Bharat / bharat

మోదీ నయా కేబినెట్​లో షా సహా కొత్త ముఖాలు! - పార్టీ

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అఖండ మెజార్టీ సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రీకృతమైంది. త్వరలో ఏర్పాటయ్యే ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్‌లో  భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సహా కొత్త ముఖాలకు చోటు దక్కనున్నట్లు  సమాచారం. కీలక హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల్లో ఒకటి ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మోదీ నయా కేబినెట్​లో షా సహా కొత్త ముఖాలు!
author img

By

Published : May 24, 2019, 6:20 PM IST

Updated : May 24, 2019, 8:28 PM IST

మోదీ నయా కేబినెట్​లో షా సహా కొత్త ముఖాలు!

లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ నూతన మంత్రివర్గంలో కొత్త ముఖాలు కనబడతాయని పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా.. గాంధీనగర్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో కేబినెట్‌లో అమిత్‌షా చేరటం ఖాయమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కీలకమైన హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖల్లో ఒకటి ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే సుష్మా ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా కేంద్ర మంత్రివర్గంలో చేరుతారన్న పాత్రికేయుల ప్రశ్నకు.. అది పార్టీ, ప్రధాని మోదీ నిర్ణయానికి సంబంధించిన విషయమంటూ అమిత్‌షా నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. పార్టీలో మాత్రం అమిత్‌షా ఈసారి కేంద్ర కేబినెట్‌లో చేరటం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది.

రాహుల్​ను ఓడించిన ఇరానీకి...

ఉత్తరప్రదేశ్​ అమేఠీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై గెలిచి చరిత్ర సృష్టించిన స్మృతి ఇరానీకి బహుమతిగా భాజపా నాయకత్వం కీలక మంత్రిత్వశాఖ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కేబినెట్​లో సభ్యులైన సీనియర్​ నేతలు రాజ్​నాథ్​ సింగ్, నితిన్​ గడ్కరీ, రవిశంకర్​ ప్రసాద్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్​ తోమర్, ప్రకాశ్​ జావడేకర్​ వంటి వారు నూతన కేబినెట్​లోనూ కొనసాగే అవకాశముంది.

మిత్రపక్షాలకు...

మిత్రపక్షాలైన శివసేన, జేడీయూ పార్టీల తరఫున గెలిచిన వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. లోక్​సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు మెరుగైన ప్రదర్శన చేశాయి.

కొత్తముఖాలు...

బంగాల్​, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈసారి కమలం బాగానే వికసించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలిచిన కమలనాథుల్లో కొంతమందికి నయా కేబినెట్​లో చోటు కల్పించనున్నారు. రెండోతరం నాయకత్వాన్ని తయారు చేసే ఆలోచనలో భాగంగానే కాషాయ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

మోదీ ఎన్నిక... 17వ లోక్​సభ ఏర్పాటు...

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ముగ్గురు కమిషనర్లు.. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతిని కలిసి, విజయం సాధించిన లోక్‌సభ సభ్యుల జాబితాను అందజేస్తారు. అనంతరం రాష్ట్రపతి ప్రస్తుత లోక్‌సభను రద్దు చేసి భాజపాను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానిస్తారు. జూన్​ 3వ తేదీ లోపల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావల్సి ఉంది.

ఎన్డీఏ పార్టీలు తమ నేతను ఎన్నుకునేందుకు శనివారం దిల్లీలో సమావేశం కానున్నాయి. ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే నరేంద్ర మోదీని రెండోసారి లోక్‌సభా పక్షనేతగా ఎన్నుకోనున్నారు.

Gandhinagar (Gujarat), May 23 (ANI): Prime Minister Narendra Modi's mother Heeraben Modi greeted the media outside her residence in Gandhinagar on Thursday. The Bharatiya Janata Party (BJP) is likely to return to power as the party took leads in over 289 seats as per the early trend suggests.
Last Updated : May 24, 2019, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.