ETV Bharat / bharat

2021 తొలినాళ్లలోనే వ్యాక్సిన్​: హర్షవర్ధన్​ - Gamaleya Scientific Research Institute

2021 తొలినాళ్లలోనే కరోనా వ్యాక్సిన్​ దేశంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. మూడు వ్యాక్సిన్​ క్యాండిడేట్లు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో నిపుణుల బృందం పర్యవేక్షిస్తున్నట్లు రాజ్యసభలో వెల్లడించారు.

Harsh Vardhan
2021 తొలినాళ్లలోనే అందుబాటులోకి వ్యాక్సిన్​: హర్షవర్ధన్​
author img

By

Published : Sep 17, 2020, 4:25 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. వ్యాక్సిన్​ కోసం యావత్​ దేశం ఎదురుచూస్తున్న క్రమంలో టీకాపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే దేశంలో కొవిడ్​ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని రాజ్యసభలో వెల్లడించారు.

"ఇతర దేశాల తరహాలోనే వ్యాక్సిన్​ కోసం భారత్ ముమ్మర​ ప్రయత్నాలు చేస్తోంది. మూడు వ్యాక్సిన్​ క్యాండిడేట్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో నిపుణుల బృందం పర్యవేక్షిస్తోంది. టీకా పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధంగా ఉంది. భారత్​లో వచ్చే ఏడాది తొలినాళ్లలోనే వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందనే నమ్మకం ఉంది."

- హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

దేశీయంగా తయారైన జైడస్​ కాడిలా, భారత్​ బయోటెక్ వ్యాక్సిన్లు తొలిదశ క్లినికల్​ ట్రయల్స్​ను పూర్తి చేసుకున్నాయి. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఏ) అనుమతులు ఇచ్చిన క్రమంలో ఇటీవల నిలిచిపోయిన ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రజెనెకా టీకా ట్రయల్స్​ను తిరిగి ప్రారంభించింది సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. ​వాటితో పాటు భారత్​లో స్పుత్నిక్-వీ​ టీకా ట్రయల్స్​, పంపిణీపై రష్యా డైరెక్ట్​ ఇన్​వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్​డీఐఎఫ్​), డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీసీజీఏ అనుమతులు ఇవ్వగానే భారత్​కు 100 మిలియన్​ డోస్​లను సరఫరా చేయనుంది రష్యా.

ఇదీ చూడండి: డా.రెడ్డీస్​కు 10 కోట్ల రష్యా టీకా డోసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.