ETV Bharat / bharat

కరోనా కలవరం: 'మహా'లో 134, రాజస్థాన్​లో 96 కొత్త కేసులు - coronavirus cases in maharashtra

దేశంలో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో 134, రాజస్థాన్​లో మరో 96 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. మొత్తం కేసుల సంఖ్య 8447కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు స్పష్టం చేసిన కేంద్రం... రక్షణ శాఖ 9 వేల పడకలను సిద్ధం చేసినట్లు పేర్కొంది.

CORONA
కరోనా కలవరం:'మహా'లో 134, రాజస్థాన్​లో 96 కొత్త కేసులు
author img

By

Published : Apr 12, 2020, 5:43 PM IST

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం విస్తరిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 8,447కి చేరింది. ఇందులో 764 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 273 మంది మరణించినట్లు పేర్కొంది.

మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు కేవలం స్వల్ప తీవ్రతతోనే ఉన్నట్లు కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 1.87 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. రక్షణ శాఖ 9 వేల పడకలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం 151 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన అగర్వాల్... పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వైరస్ పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ వైద్య కళాశాలలను అనుమతించనున్నట్లు వెల్లడించారు.

మహారాష్ట్రలో 134

దేశంలోని పలు రాష్ట్రాల్లో వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. వైరస్ కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో వైరస్ విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో నేడు మరో 134 కేసులు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ముంబయిలో అత్యధికంగా 113 కొత్త కేసులు గుర్తించారు అధికారులు. రాయ్​ఘడ్​, అమరావతి, భీవండి, పింప్రి-చింధ్​వాడాలో ఒక్కోకేసు నమోదు కాగా... పుణెలో నాలుగు, మిరా భయాందర్​లో 7, నావి ముంబయి, థానె, వాసాయ్​ విరార్​లో రెండు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1895కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాజస్థాన్​లో 96

రాజస్థాన్​లో మరో 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. మొత్తం కేసుల సంఖ్య 796కి చేరినట్లు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో జైపుర్​లో 35, బన్స్వారాలో 15, హనుమాన్​గఢ్​లో 11, జోధ్​పుర్, బికనీర్​లలో ఎనిమిది చొప్పున కేసులు గుర్తించినట్లు చెప్పారు. కోటాలో ఏడు, నాగౌర్​లో 5 సహా జైసల్మీర్, ఛురు, సికర్ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలిపారు.

covid cases in india
దేశంలో కొవిడ్-19..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.